ఉదయనిధి తల నరకండి, రూ. 10 కోట్లు ఇస్తా, స్వామీజీ సంచలనం, సనాతన దెబ్బకు !
చెన్నై/అయోధ్య: తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ కుమారుడు. ఆ రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడల శాఖా మంత్రి ఉదయానిధి స్టాలిన్ పై దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇక అయోధ్యకు చెందిన ఓ స్వామిజీ తమిళనాడు మంత్రి ఉదయానిధి తల నరికి తెచ్చి ఇస్తే రూ. 10 కోట్లు ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు మంత్రి ఉదయానిధి స్టాలిన్ శనివారం సనాతన ధర్మం నిర్మూలన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా తమిళనాడు మంత్రి ఉదయానిధి మాట్లాడుతూ సనాతన ధర్మం మలేరియా, డెంగీ, కరోనా కంటే చాలా ప్రమాదకరం అని, దాన్ని వ్యతిరేకించడం కంటే పూర్తిగా నిర్మూలించిన తరువాతే సమాజం బాగుంటుందని ఉదయానిధి సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో సనాతన ధర్మప్రకారం మహిళలు చదువుకోకూడదని, పూర్తి దుస్తులు వేసుకోకూడదని, వారు దేవాలయాల్లో అడుగుపెట్టకూడదని ఉండేదని, అయితే ద్రవిడ సిద్దంతాల ప్రకారం ఇప్పుడు మహిళలు, అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారని, స్వేచ్చగా తిరుగుతున్నారని, అదే ద్రవిడ మోడల్ విధానం అని, అందుకే సనాతన ధర్మాన్ని పూర్తిగా తెరమరుగు చెయ్యాలని మంత్రి ఉదయానిధి పిలుపునిచ్చారు.
తమిళనాడు మంత్రి ఉదయానిధి వ్యాఖ్యలతో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఆర్ఎస్ఎస్ నాయకులు, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తదితరులు ఆయన మీద మండిపడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చెందిన ఓ న్యాయవాది తమిళనాడు మంత్రి ఉదయానిధి స్టాలిన్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యకు చెందిన పరంధాస్ ఆచార్య అనే స్వామిజీ తమిళనాడు మంత్రి ఉదయానిధి స్టాలిన్ తలన నరికి తనకు తెచ్చి ఇస్తే రూ. 10 కోట్లు ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక చేతిలో ఉదయానిధి ఫోటో, మరో చేతిలో తలను నరుకుతున్న వీడియో చూపించిన స్వామిజీ పరంధాస్ ఆచార్య ఈ పని మీరు త్వరగా చెయ్యండి, రూ. 10 కోట్లు ఇస్తాను అంటూ ఉదయానిధి ఫోటోను తగలబెడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ విషయంపై ఉదయానిధి మాట్లాడుతూ ఓ స్వామిజీ తన తల నరికితే రూ. 10 కోట్లు ఇస్తానని ప్రకటించారు. ఆయన నిజంగా సాధువా, లేక డూప్లికేట్ స్వామీజీనా ?, ఈ స్వామీజీలకు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ?, 10 రూపాయల దువ్వెన ఇస్తే నేను తల చక్కగా దువ్వుకుంటాను కదా అంటూ ఉదయానిధి ఎద్దేవ చేశారు.

తమిళనాడు మంత్రి, సీఎం ముద్దుల కొడుకు ఉదయానిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. అయితే ఈ విషయంలో డీకేం, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కొందరు ఉదయానిధి సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తుంటే కొందరు సైలెంట్ గా ఉంటున్నారు.
అయితే తాను హిందూ సమాజాన్ని టార్గెట్ చెయ్యలేదని, తాను కేవలం సనాతన ధర్మాన్ని మాత్రం వ్యతిరేకించానని, తన మీద ఎన్ని కేసులు పెట్టినా తాను భయపడనని, శనివారం మాట్లాడిన మాటలకు తాను కట్టుబడి ఉంటానని తమిళనాడు మంత్రి ఉదయానిధి స్టాలిన్ తేల్చిచెబుతున్నారు. మొత్తం మీద మరోసారి బీజేపీ, డీఎంకే పార్టీల గొడవ ముదరిపోయింది.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications