అందరి ముందే కొట్టుకున్న ఎస్సైలు, ఒకరి సస్పెండ్
మధురై: మధురై నగర కమిషనర్ ఆఫ్ పోలీస్ గురువారం నాడు అవనియపురం సబ్ ఇన్స్‌పెక్టర్ (ఎస్సై) పైన వేటు వేశారు. సదరు ఎస్సై తన సహోద్యోగితో కొట్లాటకు దిగినందుకు అతనిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అతను పబ్లిగ్గానే కొట్టుకున్నారు.
డిపార్టుమెంట్ విచారణలో.. ఎస్సై దురాయ్ తప్పు చేసినట్లుగా తేలిందని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ఎస్సై దురాయ్, మరో ఎస్సై ప్రేమచంద్రన్‌లు ఇద్దరు కూడా మంచి స్నేహితులు. పైగా ఒకే బ్యాచులో ఉద్యోగంలో ఎంపికయ్యారు.

తల్లాకుళం అనే పోలీస్ స్టేషన్‌లో వీరిద్దరు విధులు నిర్వహిస్తున్నారు. అయితే వారిద్దరి మధ్య ఏదో విషయంలో మాటామాటా పెరిగింది. అనంతరం తాము బహిరంగంగా కొట్టుకుంటున్నామనే విషయాన్ని కూడా చూసుకోకుండా.. అడ్డగోలుగా తిట్టుకున్నారు. రోడ్డు పైనే తన్నుకున్నారు.
ఈ విషయం స్థానికంగా సంచలనం రేపింది. దీంతో పోలీస్ కమిషనర్ విచారణకు ఆదేశించారు. విచారణలో దురాయ్‌ది తప్పు అని తేలింది. దీంతో అతని పైన సస్పెన్షన్ వేటు వేసినట్లు పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications