సిద్దరామయ్య, డీకే శివకుమార్ కు టాస్క్ ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్, దెబ్బకు !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య పేరు ఖరారు అయ్యింది. గురువారం మద్యామ్నం 3. 30 గంటలకు బెంగళూరులోని కంఠీర స్టేడియంలో సిద్దరామయ్య ప్రమాణస్వీకారం చెయ్యడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. అయితే సిద్దరామయ్య ఊరికే సీఎం పదవి దక్కలేదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టాస్క్ లో సిద్దరామయ్య విజయం సాధించి ఆయన సత్తా చాటుకోవాలని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ బుధవారం మద్యాహ్నం వరకు నువ్వానేనా అంటూ పోటీ పడ్డారు. ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చేసిన రాజీ చర్చలు ఏమాత్రం ఫలించలేదు. అయితే రాహుల్ గాంధీ రంగంలోకి దిగి ఇద్దరు నాయకులతో వేర్వేరుగా చర్చలు జరిపారు.

సిద్దరామయ్యతో మొదట చర్చలు జరిపిన రాహుల్ గాంధీ ఆయన్ను ఒప్పించారు. తరువాత డీకే శివకుమార్ ను ఇంటికి పిలిపించుకున్న రాహుల్ గాంధీ ఆయనతో చర్చలు జరిపారు. సిద్దరామయ్యకు 2 సంవత్సరాలు, తరువాత మూడు సంవత్సరాలు డీకే శివకుమార్ ను సీఎం చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయించింది.
రాహుల్ గాంధీ రాజీ చర్చలు జరుగుతున్న సమయంలో డీకే శివకమార్ తో ఫోన్ లో మాట్లాడిన సోనియా గాంధీ నేను మీకు అండగా ఉంటానని, ఈ ఒక్కసారికి మేము చెప్పినట్లు వినాలని, రాహుల్ గాంధీ మీతో మాట్లాడుతారని చెప్పారని తెలిసింది. సోనియా గాంధీతో మాట్లాడిన తరువాత డీకే. శివకుమార్ సీఎం పదవి కోసం పట్టిన పట్టును వదల్లేదు.
అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఊరికే సిద్దరామయ్యకు సీఎం పదవి ఇస్తామని ఊరికే హామీ ఇవ్వలేదని వెలుగు చూసింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సిద్దరామయ్య 18 లోక్ సభ సీట్లలో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ టాస్క్ కొట్టిందని తెలిసింది. ఇక రెండో విడతలో సీఎం కావావలని అనుకుంటున్న డీకే శివకుమార్ కూడా లోక్ సభ ఎన్నికల్లో 10 సీట్లలో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ టాస్క్ ఇచ్చిందని తెలిసింది.
కర్ణాటకలో 28 లోక్ సభ నియోజక వర్గాల్లో సిద్దరామయ్య 18 సీట్లలో, డీకే శివకుమార్ 10 సీట్లలో విజయం సాధించి వారి సత్తా చాటుకోవాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సూచించిందని తెలిసింది. కర్ణాటకలో 135 సీట్లు సంపాధించిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ ఎంపీలు దక్కే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ ఊహించుకుంటున్నది.
కర్ణాటకలో ఉన్న 28 లోక్ సభ నియోజక వర్గాలు మొత్తం గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్లాన్ చేస్తే బీజేపీ, జేడీఎస్ పార్టీలు చూస్తూ ఉంటాయా ? అని అనుమానం మొదలైయ్యింది. అయితే సిద్దరామయ్య సీఎం అయిన తరువాత ప్రతిపక్షాలు ఎలాంటి ప్లాన్ వేస్తారు ?, కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ కార్డు పథకాలు అమలు చెయ్యకపోతే ప్రతిపక్షాలు చూస్తు ఉంటాయా ? అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications