హమ్మయ్యా, సీఎంగా సిద్దూ, డీసీఎంగా డీకే, సిద్దరామయ్య ఆమాట పబ్లిక్ గా చెప్పాలని షరతు !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక సీఎం ఎవరు ? అనే విషయంలో ఇన్ని రోజులు జరిగిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. మొత్తం మీద సిద్దరామయ్య అనుకున్నది సాదించి సీఎంగా ప్రమాణస్వీకారం చెయ్యడానికి సిద్దం అయ్యారు. ఇదే సమయంలో డీకే శివకుమార్ పెట్టిన షరతులకు సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరి ముందు సిద్దరామయ్య ఆమాట ఇవ్వాలని సమాచారం.
గురువారం రాత్రి 7 గంటలకు బెంగళూరులోని క్వీన్స్ రోడ్డులోని ఇందిరా భవన్ లో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహిస్తున్నారు. సీఎల్పీ సమావేశంలో సిద్దరామయ్య, డీకే శివకుమార్ తో పాటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పెద్దలు పాల్గొంటున్నారు. ఇదే సమయంలో డీకే శివకుమార్ చేసిన డిమాండ్లకు సిద్దరామయ్య ఎమ్మెల్యేల అందరి ముందు అంగీకరించాలి.

కొత్తగా శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా సమావేశానికి హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఢిల్లీలో బుధవారం అర్దరాత్రి దాటిన తరువాత కూడా సిద్దరామయ్య, డీకే శివకుమార్ లతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు చెందిన కేసీ. వేణుగోపాల్ చర్చలు జరిపారు.
సిద్దరామయ్య రెండున్నర సంవత్సరాలు, తరువాత డీకే శివకుమార్ రెండున్నర సంవత్సరాలు సీఎంగా ఉండటానికి అంగీకరించారని తెలిసింది. తరువాత కేసీ వేణుగోపాల్ నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఇంటికి వెళ్లి సిద్దరామయ్య, డీకే శివకుమార్ రాజీ అయ్యారని చెప్పారని ఏఎన్ఐ మీడియా తెలిసింది.
అయితే డీకే శివకుమార్ ఓ షరుతు పెట్టారు. బెంగళూరులో జరిగే సీఎల్పీ సమావేశంలో తాను రెండున్నర సంవత్సరాల తరువాత సీఎం పదవికి రాజీనామా చేసి డీకే శివకుమార్ కు అదవి అప్పగిస్తానని సిద్దరామయ్య అందరి ముందు వాగ్దానం చెయ్యాలని డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముందు డిమాండ్ పెట్టారు.
సిద్దరామయ్య అందుకు అంగీకరించడంతో సీఎం రేసుకు ఇంతకాలం జరుగుతున్న పోటీకి తెరపడింది. సిద్దరామయ్య సీఎంగా, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈనెల 20వ తేదీన ప్రమాణస్వీకారం చేస్తారని, ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో పాటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నాయకులు, వివిద రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారని తెలిసింది.
గురువారం రాత్రి బెంగళూరులో సీఎల్ పీ సమావేశం పూర్తి అయిన తరువాత కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య పేరును అధికారికంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రకటిస్తుందని తెలిసింది. అయితే ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ మాత్రమే ఉంటారని, ఇంకెవ్వరికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఉండని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు చెందిన ఓ సీనియర్ నాయకుడు తెలిపారు.












Click it and Unblock the Notifications