బిపాసా బసుతో కలిసి యోగా చేసిన ముఖ్యమంత్రి
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బాలీవుడ్ నటి, ఫిట్నెస్ నిపుణురాలు బిపాషా బసు, తదితరులు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బెంగళూరులోని కంటీర్వ స్టేడియంలో యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమం మంగళవారం ఉదయం 7గంటల నుంచి 8.30 వరకు సాగింది.
కేంద్రమంత్రి అనంత్ కుమార్ తోపాటు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. తాను ఏడాది నుంచి యోగా చేస్తున్నట్లు తెలిపారు. యోగాతో తనలో కొంత మార్పు కనిపించిందని చెప్పారు.

పాఠశాలలు, కళాశాలల్లో యోగాను అదనపు పాఠ్యాంశంగా తప్పనిసరి చేస్తామని హామి ఇచ్చారు. యోగా చేయడం వల్ల ఒత్తిడి అధిగమించవచ్చని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. కాగా, గత సంవత్సరం సిద్ధరామయ్య బాలీవుడ్ నటి శిల్పాశెట్టితోపాటు యోగాసనాలు వేశారు.
ఇది ఇలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోడీ ఛండీగఢ్‌లో జరిగిన భారీ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగాను అలవాటుగా మార్చుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చని తెలిపారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications