కర్నాటక సర్కార్ కీలక నిర్ణయం-బీజేపీ వివాదాస్పద నిర్ణయాలన్నీ వెనక్కి?

కర్నాటకలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ప్రజా తీర్పుకు అనుగుణంగా గతంలో బీజేపీ ప్రభుత్వాలు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల సమీక్షకు సిద్ధమవుతోంది. ఈ మేరకు తాజాగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంక్ ఖర్గే సంకేతాలు ఇచ్చారు. పాఠ్యపుస్తకాల సవరణలు, మత మార్పిడి నిరోధక చట్టం, గోహత్య చట్టంతో సహా గత బీజేపీ ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను సమీక్షిస్తామన్నారు.

హిజాబ్ వివాదంపై చట్టపరంగా ముందుకెళ్తామని మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. బీజేపీ హిజాబ్ పై తీసుకున్న నిర్ణయంతో 18 వేల మంది పిల్లలు స్కూళ్లకు దూరమయ్యారన్నారు. పాఠ్యపుస్తకాల సవరణ, మార్పిడి నిరోధక చట్టం, గోహత్య నిరోధక చట్టం సహా బీజేపీ ప్రవేశపెట్టిన అన్ని ఇతర చట్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్షిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ఆర్థిక శ్రేయస్సు, కన్నడిగుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

siddaramaiah government to review past bjp regime decisions including text book revisions

తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం గత బీజేపీ సర్కార్ మంజూరు చేసిన ప్రాజెక్టులకు చెల్లింపులను నిలిపివేయాలని నిర్ణయించింది.మాజీ పాఠశాల విద్యాశాఖ మంత్రి బిసి నగేష్ అమలు చేసిన వివాదాస్పద పాఠశాల పాఠ్యపుస్తకాల సవరణలపై కాంగ్రెస్ నేతలతో పాటు విద్యావేత్తల నుండి "కాషాయీకరణ" విమర్శలకు దారి తీశాయి. ఈ మేరకు విద్యావేత్తలు, విద్యా నిపుణులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. వారిలో ఒకరైన విపి నిరంజనారాధ్య, వివాదాస్పద అధికారి రోహిత్ చక్రతీర్థ సహా ప్యానెల్ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

అసోసియేటెడ్ మేనేజ్‌మెంట్స్ ఆఫ్ స్కూల్స్ ఇన్ కర్ణాటక (KAMS) అధ్యక్షుడు డి శశికుమార్ కూడా సీఎం సిద్ధరామయ్యకు రాసిన లేఖలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి మార్చబడిన పాఠ్యాంశాన్ని కోర్సు నుండి నిలిపివేయాలని కోరారు. గతంలో బీజేపీ కర్ణాటక ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ కాటిల్ యాక్ట్, 2020ని ఆమోదించింది. ఇది ఉల్లంఘిస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి. ఈ చట్టం ఆధారంగా ఏదైనా ప్రాంతాన్ని సోదాలు చేసే స్వాధీనం చేసుకునే అధికారాలను ఇచ్చింది. దీనిపైనా కాంగ్రెస్ సర్కార్ సమీక్షించబోతోంది.

అాలాగే గతేడాది మే నెల నుంచి మత మార్పిడి నిరోధక చట్టం కూడా అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం బలవంతం, మితిమీరిన ప్రభావం, ప్రలోభపెట్టడం ద్వారా ఏ వ్యక్తిని నేరుగా లేదా ఇతర వ్యక్తిని ఒక మతం నుండి మరొక మతంలోకి మార్చడానికి ప్రయత్నించకూడదు. ఏదైనా మోసపూరిత మార్గాల ద్వారా లేదా వివాహం ద్వారా, లేదా ఏ వ్యక్తి కూడా మతమార్పిడులకు సహకరించకూడదు లేదా కుట్ర చేయకూడదు. దీన్ని కూడా కాంగ్రెస్ సర్కార్ సమీక్షించబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+