Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డీకే నెత్తిన బండరాయి వేసిన సీఎం, హైదరాబాద్ లో ఉంటే, మైండ్ బ్లాక్ స్టేట్ మెంట్ !

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండున్నరేళ్ల తర్వాత సీఎం మారతారని ఢిల్లీలో డీల్ జరిగింది. మొదటి విడతలో సిద్దరామయ్యను సీఎం చేశారు. అయితే ఐదేళ్లపాటు మనదే ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, ముఖ్యమంత్రి పదవిలో తానే ఉంటానని సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం సిద్దరామయ్య కర్ణాటకతో పాటు ఢిల్లీలో తీవ్రచర్చకు తెర లేపారు.

ఐదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, అందులో ఎలాంటి అనుమానం లేదని సీఎం సిద్దరామయ్య బహిరంగంగా స్పష్టం చేశారు. గురువారం హోస్ పేట్ లోని ప్రభుత్వ అండర్ గ్రాడ్యుయేట్ కళాశాల ఆవరణలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీడియాతో మాట్లాడారు.

 Siddaramaiah made sensational comments that he will be the Chief Minister of Karnataka for five years

అక్రమ మైనింగ్‌పై కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని సీఎం సిద్దరామయ్య అన్నారు. ఏదైనా కేటగిరీ మైనింగ్‌కు చట్టబద్ధత కల్పిస్తే సంబంధిత శాఖల నుంచి పూర్తి సహకారం అందిస్తామని సీఎం సిద్దరామయ్య చెప్పారు. అటవీశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి చర్చించి ఏ,బీ,సీ, ఏ కేటగిరీ మైనింగ్‌కు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోాలని సూచిస్తామని, అటవీ శాఖ భూముల్లో మైనింగ్‌కు ప్రత్యామ్నాయ చర్యలపై కూడా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం సిద్దరామయ్య అన్నారు.

కర్ణాటకలో అక్రమ మైనింగ్‌పై గతంలో పోరాడామని, అక్రమ మైనింగ్‌పై మా కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని సీఎం సిద్దరామయ్య అన్నారు. హోస్ పేట్ లో అండర్ గ్రాడ్యుయేట్ కళాశాల, హైస్కూల్, లైబ్రరీ భవనాలు కలిపి మొత్తం రూ. 36 కోట్లు వ్యయంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం సిద్దరామయ్య ప్రారంభించారు. ఈ సౌకర్యాలతో కూడిన భవనాల ద్వారా సుమారు 3 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని సిద్దరామయ్య చెప్పారు.

 Siddaramaiah made sensational comments that he will be the Chief Minister of Karnataka for five years

త్వరలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ప్రజలు136 సీట్లలో గెలిపించినా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ కట్టబెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు పాలిస్తుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సీఎం సిద్దరామయ్య గురువారం జోస్యం చెప్పారు.

గతంలో ఓ సారి ఆపరేషన్ కమలాలో భాగంగా భాజపా విజయం సాధించింది కాబట్టి ఇప్పుడు మళ్లీ బీజేపీ అలాంటి ప్రయత్నాన్ని ప్రారంభించవచ్చని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అయితే వారి ప్రయత్నం ప్రయత్నం ఫలించదని సీఎం సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేశారు.

 Siddaramaiah made sensational comments that he will be the Chief Minister of Karnataka for five years

కర్ణాటక ప్రభుత్వంలో ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఉంటారా అన్న మీడియా ప్రశ్నకు సీఎం సిద్దరామయ్య స్పందిస్తూ కాంగ్రెస్ జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ కాదని అన్నారు. ముగ్గురు ఉప ముఖ్యమంత్రుల విషయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని, హైకమాండ్ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య చెప్పారు. హంపి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారా అన్న ప్రశ్నకు సీఎం సిద్దరామయ్య బదులిస్తూ గతేడాది జనవరి నెలలో హంపి ఉత్సవాన్ని నిర్వహించినట్లే ఈ ఏడాది కూడా జనవరి నెలలో హంపి ఉత్సవాన్ని నిర్వహిస్తామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+