ప్రజ్వల్ రేవణ్ణను విదేశాలకు పంపించిందే ఆయన, మాజీ ప్రధాని పనికి?, సీఎం ఇదే చెప్పింది!

హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసు బయటకు వచ్చి 23 రోజులు అవుతున్నా ఇంకా ఆ వేడి ఏమాత్రం చల్లారడంలేదు. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను విదేశాలకు పంపించింది మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాలకు పంపించిన మాజీ ప్రధాని దేవేగౌడ ఇప్పుడు బహిరంగ లేఖ రాసి ఏం చేస్తారు? అని సిద్దరామయ్య జేడీఎస్ నాయకులను ప్రశ్నించారు.

నాకు ఉన్న సమాచారం ప్రకారం హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ విదేశాలకు పంపించారని, తరువాత బహిరంగ లేఖ రాసి ఆయన్ను లొంగిపోవాలని చెబుతున్నారని, ఆయనే విదేశాలకు పంపించి ఇఫ్పుడు ప్రజల్లో సింపతి కొట్టేయాలని నాటకాలు ఆడుతున్నారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దుయ్యబట్టారు. శనివారం మైసూరులో మీడియాతో మాట్లాడిన సిద్దరామయ్య జేడీఎస్ నాయకులపై విరుచుకుపడ్డారు.

Siddaramaiah said that former Prime Minister HD Deve Gowda himself had sent Prajwal Revanna abroad

మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి అన్నకొడుకు ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కేసులు నమోదు అయ్యాయని అన్నారు. ఎవరు అత్యాచారం చేసినా పెద్ద నేరం. ఈ సీరియస్ ఇష్యూ నుంచి దృష్టి మరల్చేందుకు మాజీ సీఎం కుమారస్వామి ఏదో మాట్లాడుతున్నారని, డీసీఎం డీకే. శివకుమార్ తోపాటు ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని, ఇలా చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని సీఎం సిద్దరామయ్య విరుచుకుపడ్డారు.

బీజేపీ ఎమ్మెల్యే హరీశ్‌పూంజా పోలీసులను బెదిరించిన కేసుకు సంబంధించి ఆయన మీద ఐపీసీ 353 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, చట్టం అందరికీ ఒకటేనని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే హరీశ్‌పూంజా అరెస్ట్‌కు కాంగ్రెస్‌ ఒత్తిడి చేస్తోందన్న విపక్షాల ఆరోపణపై సీఎం సిద్దరామయ్య స్పందించారు. చట్టం అందరికీ ఒకటే అని, ఐపీఎస్ 353 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని సిద్దరామయ్య అన్నారు.

Siddaramaiah said that former Prime Minister HD Deve Gowda himself had sent Prajwal Revanna abroad

ఈ సెక్షన్ నాన్ బెయిలబుల్ కిందకు వస్తుందని, ఈ చట్టం ప్రకారం బీజేపీ ఎమ్మెల్యేకి ఏడు ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని సిద్దరామయ్య అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే హరీష్ పూంజా స్టేషన్ బెయిల్ పొందడంపై సీఎం సిద్దరామయ్య స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యేపై పోలీసులను బెదిరించిన రెండు కేసులు నమోదు అయ్యాయని, ఎమ్మెల్యే అయితే పోలీసులను బెదిరిస్తారా ? అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య బీజేపీ నాయకులను నిలదీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+