శివరాత్రి రోజు మటన్ తిన్నా.. శుభ ముహూర్తాలను నమ్మను: సీఎం సంచలనం
కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను శివరాత్రి, ఉగాది లాంటి పర్వదినాల రోజు నాన్- వెజ్ తిన్నానని అన్నారు. ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి అలాగే ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి శుభ ముహూర్తం చూసుకోవాలన్న నమ్మకాలను ఆయన తిరస్కరించారు. ఈ మేరకు ప్రతిపక్షాల ఆందోళన మధ్య రాహుకాలంలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు టైమ్ విషయంలో అలాంటి పట్టింపులు ఏమీ లేవని.. పండగల సమయంలో అందరూ వెజ్ ఫుడ్ తింటే.. తాను ఆ సమయంలోనే నాన్ వెజ్ తినేందుకు ఇష్టపడతానని కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను శివరాత్రి రోజు మటన్ తిన్నానని.. శుభ ముహూర్తాలపై తనకు నమ్మకం లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుకాలంలో బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని ఆపాలంటూ ప్రతిపక్షాల నుంచి వచ్చిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. తాను ఇతరుల మాటలను గౌరవిస్తానని కానీ మూఢనమ్మకాలను మాత్రం ప్రోత్సహించనని తెలిపారు. ప్రభుత్వ పనులు చేయడానికి మంచి సమయం ఏంటని.. అన్ని రోజులు సమానమేనని స్పష్టం చేశారు.
ఆహారం, సమయం విషయంలో మత పరమైన కట్టుబాట్లను తాను విశ్వసించనని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. మూఢ నమ్మకాలతో ప్రభుత్వాన్ని నడపడం సాధ్యం కాదని అన్నారు. అధికార పార్టీ కావాలనే రాహుకాలంలో బడ్జెట్ ప్రవేశపెడుతోందని ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలపై ఈ మేరకు సీఎం సిద్ధరామయ్య స్పందించారు. రాహుకాలం, యమగండం, గుళిక కాలం.. తదితర నమ్మకాలను తాను ఎప్పుడూ తిరస్కరిస్తానని స్పష్టం చేశారు. మూఢ నమ్మకాలతో ప్రభుత్వాన్ని నడపలేమని పేర్కొన్నారు.

"నేను గతంలో అనేకసార్లు రాహుకాలంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టాను. ఈ సారి నేను ఆ విధానాన్ని మార్చుకోవాలని నా కుటుంబ సభ్యులు, అధికారులు నన్ను రిక్వెస్ట్ చేశారు. వారి మాటలను మాత్రమే కాదు ప్రజాస్వామ్యాన్ని కూడా గౌరవిస్తాను. వ్యక్తిగతంగా నాకు రాహుకాలం లాంటి పట్టింపులు ఏమీ లేవు" అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కర్ణాటక ప్రతిపక్షనేత, బీజేపీ నాయకుడు ఆర్. అశోక.. ఈ అంశాన్ని తొలుత లేవనెత్తారు. రాహుకాలం అని తెలిసి కూడా సీఎం బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని మండిపడ్డారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications