Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రధాని మోదీని ఇరకాటంలో పెట్టిన సీఎం, ఊ అంటే ఆ సీఎంకు కోపం, ఊహు అంటే మొదటికే మోసం !

కావేరీ నదీ జలాల సమస్య తరచుగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య నిత్యం వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా కావేరీ నదీజలాల పంపకాల అంశాన్ని ప్రస్తావిస్తూ కర్ణాటక పొరుగు రాష్ట్రమైన తమిళనాడు కర్ణాటకపై న్యాయపోరాటానికి సిద్ధమైంది. కావేరీ జలాల సమస్యకు స్వస్తి పలికేందుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసినట్లు కనిపిస్తోంది.

ఇప్పుడు కావేరి నదిపై కొత్త డ్యామ్‌ నిర్మించే విషయంపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఓ సూచన చేశారు. కర్ణాటకలో కావేరీ నదిపై ఉన్న అతి పెద్ద డ్యామ్ కేఆర్ఎస్ డ్యామ్. కానీ కష్టాలొచ్చినా, కరువు వచ్చినా అందులో ఉండే నీరు తమిళనాడుకు వదలాలి కానీ కేఆర్ఎస్ డ్యామ్ లోని నీరు కర్ణాటకకు, తమిళనాడుకు ఏమాత్రం కూడా సరిపోదు. అందుకే కావేరీ నదికి అడ్డంగా కొత్త డ్యామ్‌ను నిర్మించాలనే డిమాండ్‌ మొదటి నుంచి ఉంది.

Siddaramaiah sought permission from PM Narendra Modi for construction of Mekadatu project

అయితే కర్ణాటక నాయకులు కొత్త డ్యామ్ నిర్మించాలనే ప్రయత్నం ఇంతకాలం వర్కవుట్ కాలేదు. ఇప్పుడు సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం వీటన్నింటికీ చెక్ పెడుతూ ఒక విజన్ సృష్టించడానికి ఒక ప్రాజెక్ట్‌ను రూపొందించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక సమాచారం అందించారు.

మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో సుదీర్ఘంగా మాట్లాడిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పలు అంశాలను ప్రస్తావించారు. ఇందులో మేకేదాటు తాగునీటి ప్రాజెక్టుపైనా చర్చించారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం సిద్ధరామయ్య కూడా తెలియజేశారు. ఇంతకీ మేకేదాటు తాగునీటి ప్రాజెక్టుపై సీఎం సిద్ధరామయ్య ఏం చెప్పారు? అనే విషయంలో బెంగళూరు ప్రజలతో పాటు కర్ణాటక ప్రజలు ఆసక్తిగా ఎదురు చూశారు.

దీనిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. మేకేదాటు తాగునీటి ప్రాజెక్టు రాష్ట్ర సరిహద్దుల్లో నిర్మించనున్నామని, రాజకీయ కారణాలతో తమిళనాడు ప్రభుత్వం మేకదాటు ప్రాజెక్టు నిర్మించకూడదని వాదిస్తోందని, మేకదాటు ప్రాజెక్టుతో తాగునీటితోపాటు 400 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని, విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే నీరు కూడా తమిళనాడుకు వెళ్తుందని, ఇది వారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుందని సీఎం సిద్దరామయ్య అంటున్నారు.

Siddaramaiah sought permission from PM Narendra Modi for construction of Mekadatu project

మేకదాటు ప్రాజెక్ట్ పూర్తి అయితే బెంగళూరు, రామనగర జిల్లాలకు తాగునీటితో ప్రయోజనం చేకూరుతుందని, కాబట్టి వీలైనంత త్వరగా మేకదాటు ప్రాజెక్టు నిర్మించడానికి అనుమతి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. కన్నడిగుల తాగునీటి పథకంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రధాని మోదీకి వినతిపత్రం సమర్పించారు.

అయితే మేకదాటు ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే విషఫయం వేచి చూడాలి. మేకదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇస్తే తమిళనాడులో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. అలాగే మేకదాటు ప్రాజెక్టు నిర్మాణం కోసం అనుమతి ఇవ్వకపోతే బెంగళూరుతో పాటు కర్ణాటకలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉండటంతో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర ప్రభుతంలోని పెద్దలు ఆచూతూచి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+