వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'సిద్దూ నా కొడుకులాంటివాడు,ఎలాంటి షరతులు లేవు', ఆయన ఆస్తి 46 కోట్లు

కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మాజీ క్రికెటర్ సిద్దూ ఎలాంటి షరతులు పెట్టలేదని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చెప్పారు. పార్టీలో సిద్దూ ఒక సైనికుడిలా పనిచేస్తున్నారని చెప్పారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమృత్ సర్ : కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మాజీ క్రికెటర్ సిద్దూ ఎలాంటి షరతులు పెట్టలలేదని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చెప్పారు. పార్టీలో సిద్దూ ఒక సైనికుడిలా పనిచేస్తున్నారని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీలో ఇటీవలే మాజీ క్రికెటర్ సిద్దూ జాయిన్ అయ్యారు.అయితే సిద్దూ జాయిన్ కావడానికి అనేక షరతులు పెట్టాడని ప్రచారంలో ఉంది.అయితే ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండించింది.

సిద్దూ ఎలాంటి షరతులు లేకుండా కాంగ్రెస్ పార్టీలో చేరాడని ఆయన చెప్పుకొచ్చారు. సిద్దూ తండ్రి సుదీర్ఘకాలంపాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడని ఆయన గుర్తుచేశారు.

పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా సిద్దూ పనికొస్తాడని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి సిద్దూప్రచారం కలిసివస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

సిద్దూ ఎలాంటి షరతులు లేకుండా కాంగ్రెస్ లో చేరాడు

సిద్దూ ఎలాంటి షరతులు లేకుండా కాంగ్రెస్ లో చేరాడు

మాజీ క్రికెటర్ సిద్దూ ఎలాంటి షరతులు లేకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరాడని మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో అధికారంలోకి వస్తే సిద్దూ ఉపముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం కూడ జోరుగా సాగుతోంది. అయితే అమరీందర్ సింగ్ చేసిన ప్రాధాన్యతను కలిగించింది. ఈ మేరకు క్రికెటర్ సిద్దూ చేరికతో పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కానుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. సిద్దూ కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల తనకు ఆనందంగా ఉందన్నారాయన.

సిద్దూ నా కొడుకు లాంటి వాడు

సిద్దూ నా కొడుకు లాంటి వాడు

మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ పై మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అమరీందర్ సింగ్ ప్రశంసలవర్షం కురిపిస్తున్నాడు. సిద్దూ తన కొడుకు లాంటి వాడన్నారు. పంజాబ్ ఎన్నికలను పురస్కరించుకొని సిద్తూతో కలిసి పంజాబ్ లో తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడారు. సిద్దూ చేరిక విషయంలో తనపై వచ్చిన విమర్శలకు ఆయన చెక్ పెట్టేవిధంగా అమరీందర్ మాట్లాడారు. అందుకే ఆయన సిద్దూను తనను కొడుకులాంటి వాడని చెప్పారు..

సిద్దూ ఆస్తులు రూ.46 కోట్లు

సిద్దూ ఆస్తులు రూ.46 కోట్లు


అమృత్ సర్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుండి సిద్దూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు. సిద్దూ తన నామినేషన్ దాఖలు చేశాడు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సమయంలో తనకు రూ. 45.91 కోట్ల ఆస్తులున్నాయని ఆయన వెల్లడించారు.ఇందులో రూ.44 లక్షల లాచీలు, రూ.15 లక్షల బంగారు నగలు, రూ. 30 కోట్ల ప్లాట్లు, రెండు క్రూయిజర్లు, ఓ మినీ కూపర్ ఉన్నాయని ఆయన వెల్లడించారు.

సిద్దూ భార్యకు కూడ ఆరు కోట్ల ఆస్తులు

సిద్దూ భార్యకు కూడ ఆరు కోట్ల ఆస్తులు

మాజీ క్రికెటర్ సిద్దూ సతీమణి కూడ ఈ ఎన్నికల్లో పోటీచేస్తోంది. గతంలో ఆమె బిజెపి అభ్యర్థిగా బరిలో దిగింది.అయితే సిద్దూ కంటే ముందుగానే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది. సిద్దూ పేరున ఇప్పటికే రూ.46 కోట్ల రూపాయాల ఆస్తులున్నాయని ఆయన వెల్లడించారు. అయితే సిద్దూ సతీమణి నవజోత్ కౌర్ పేరున సుమారు రూ.6.94 కోట్ల రూపాయాల ఆస్తులున్నాయి. దీంతో పాటుగా రూ.2.35 కోట్ల పర్సనల్ లోన్ , రూ.54.24 లక్షల అప్పులున్నాయని ఆమె ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించారు.

English summary
siddhu has joined in congress party without any pre conditions says punjub pcc president amarinder singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X