వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్ ముఖ్యమంత్రి రాజీనామా : కీలక భేటీ కి ముందే-కాసేపట్లో కొత్త సీఎం ఎంపిక : పార్టీకి గుడ్ బై చెబుతారా..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఊహించిందే జరిగింది. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేసారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్ కు లేఖ సమర్పించారు. దీంతో..ఇప్పుడు పంజాబ్ లో కొంత కాలంగా అధికార కాంగ్రెస్ లో సాగుతున్న ఆధిపత్య పోరాటంలో ఒక అంకం ముగిసింది. కీలకమైన పార్టీ శాసనసభా పక్ష సమావేశానికి ముందే ముఖ్యమంత్రి రాజీనామా చేసారు. పంజాబ్ లో సిద్దు వర్సెస్ అమరీందర్ గా సాగుతున్న ఆధిపత్య పోరు పార్టీకి నష్టం చేసే విధంగా ఉందని పార్టీ హైకమాండ్ నిర్ణయానికి వచ్చింది.

దీంతో..ఈ సాయంత్రం పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని..పార్టీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ ను అధినాయకత్వం ఆదేశించింది. దీంతో..ముందుగా నిర్ణయించిన ప్రకారం కాసేపట్లో పంజాబ్ కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం కానుంది దీంతో..ఇప్పుడు జరిగే సమావేశంలో కొత్త సీఎంను ఎంపిక చేయనున్నారు. సీఎం అమరీందర్..సిద్దూ మధ్య ముదిరిన విభేదాలతో ఈ మథ్య కాలంలో హైకమాండ్ సిద్దూకు పంజాబ్ పీసీసీ బాధ్యతలు అప్పగించింది.

Sidhu vs Captain:Amarinder singh resigns as Punjab CM, what next for him in congress

అయినా..పార్టీ ఎమ్మెల్యేలతో సిద్దూ తరచుగా సమావేశాలు నిర్వహిస్తూ తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని అమరీందర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తాను కొనసాగలేనని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులు క్రితం కొందరు ఎమ్మెల్యేలు సీఎం అమరీందర్ ను తప్పించాలంటూ సోనియాకు లేఖ రాసారు. అమరీందర్..సిద్దూ మధ్య సయోధ్య కోసం హైకమాండ్ చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. మరి కొందరు ఎమ్మెల్యేలు వెంటనే పార్టీ లెజిస్లేచర్ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు.

దీంతో..పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఈ సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమావేశం ఇప్పుడు కీలకంగా మారింది. తాజాగా గుజరాత్ లో సీఎం విజయ్
రూపానీ మార్చి కొత్త వారికి అవకాశం ఇచ్చిన విధంగానే పంజాబ్ లోనూ నిర్ణయం తీసుకోవాలని పార్టీలోని అమరీందర్ వ్యతిరేకులు డిమాండ్ చేస్తున్నారు. అమరీందర్ కేబినెట్ లోని నలుగురు మంత్రులు సహా డజను మంది ఎమ్మెల్యేలు పార్టీ అధినాయకత్వానికి సీఎం ను మార్చాలంటూ లేఖ రాసారు.

ఎన్నికల హామీలను అమలు చేయటంలో అమరీందర్ విఫలమయ్యారని పేర్కొన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో గెలవాలంటే ముందుగా సీఎం ను తప్పించాలని వారు కోరుతున్నారు. దీంతో..అమరీందర్ రాజీనామాతో ఇప్పుడు కొత్త సీఎం ఎవరనే చర్చకు కాసేపట్లో స్పష్టత రానుంది. అందులో ప్రధానంగా మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జక్కర్ పేరు బలంగా వినిపిస్తోంది. కొత్త సీఎం ను ఎంపిక చేసే సమావేశంలోనూ..తరువాత అమరీందర్ మద్దతు దారులుగా ఉన్న ఎమ్మెల్యేలు ఏ రకంగా వ్యవహరిస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
With Many MLAs expressing their unhappiness over Punjab CM Captain Amarinder Singh finally resigned to his post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X