ఆ లోగా ఆధార్ - సిమ్ కార్డ్ అనుసంధానం, లేదంటే డీయాక్టివేషన్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం 2018 ఫిబ్రవరి లోగా అన్ని మొబైల్ సిమ్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి. లేదంటే వాటిని వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి డీయాక్టివేట్ చేసే అవకాశముంది.

ఆధార్ - సిమ్ అనుసంధానానికి ప్రభుత్వం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు గడువు ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ లింకింగ్‌ను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది.

అన్ని సిమ్ కార్డులను ఆధార్ నంబరుతో నిజనిర్ధారణ చేసుకోవాలని, ఆధార్ నంబరుతో అనుసంధానం కాని సిమ్‌లను ఫిబ్రవరి 2018 తర్వాత డీయాక్టివేట్ చేయాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.

SIM Cards Not Linked To Aadhaar To Be Deactivated After February 2018: Sources

ఎన్జీవో లోక్‌నీతి ఫౌండేషన్ వేసిన పిల్‌ను విచారించిన కోర్టు అప్పట్లో ఈ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలపై స్పందించిన అప్పటి అటార్నీ జనరల్ మాట్లాడుతూ 105 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉండడంతో దీనికి కొంత సమయం పడుతుందని తెలిపారు.

మొత్తం యూజర్లలో 90 శాతం మంది ప్రీ-పెయిడ్ యూజర్లు ఉన్నట్టు పేర్కొన్నారు. దీంతో కోర్టు ఏడాది సమయం ఇచ్చింది. కాగా, ఆధార్-సిమ్ అనుసంధానం వల్ల మోసపూరిత సమాచారం, మిస్ యూజ్‌ను తగ్గించవచ్చని కేంద్రం యోచిస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The government is moving ahead with linking Aadhaar with mobile SIM cards and all unlinked phones will be deactivated after February 2018, said informed sources.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X