ఆడపిల్లలకు 'సిందూరి'.. మగపిల్లలకు 'సిందూర్'.. దేశభక్తి అంటే ఇదే కదా..
'ఆపరేషన్ సిందూర్' ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఈ పేరు పాకిస్థాన్ గుండెల్లో అలజడి రేపుతోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఎక్కుపెట్టిన అస్త్రమే ఆపరేషన్ సింధూర్. ఈ మిషన్ లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట 44 నిమిషాలకు దాడులు చేపట్టింది. కేవలం 25 నిమిషాల్లోనే పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ప్రాంతాల్లో దాడులు చేసింది. భారత్ నిర్వహించిన ఈ దాడుల్లో దాదాపు 100 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు కేంద్ర రక్షణశాఖ పేర్కొంది.
'ఆపరేషన్ సిందూర్'పై దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. అటు పహల్గాం బాధితులతో పాటు యావత్ భారతావని ఈ నిర్ణయాన్ని హర్షిస్తోంది. అయితే మరికొందరు తమకున్న దేశ భక్తిని వినూత్నంగా చాటారు. ఈ క్రమంలో బిహార్ లోని ఓ ఆస్పత్రిలో 12 మందికి 'సిందూర్', 'సిందూరి' అనే పేర్లు పెట్టారు ఆ పిల్లల తల్లిదండ్రులు. ఈ మేరకు వినూత్నంగా తమ దేశభక్తిని చాటారు. 'ఆపరేషన్ సిందూర్'ను ఎప్పటికీ తమ మదిలోనే భద్రపరుచుకుంటామని ఈ మేరకు చెబుతున్నారు.

అలాగే ముజఫర్ పూర్ లోని కేజ్రీవాల్ చిల్డ్రన్ ఆస్పత్రిలో కూడా అక్కడి తల్లులు దేశ భక్తిని చాటారు. 'ఆపరేషన్ సిందూర్' రోజున పుట్టిన 12 మంది పిల్లలకు పేర్లు పెట్టారు. మగపిల్లలకు 'సిందూర్', ఆడపిల్లకు 'సిందూరి' అని నామకరణం చేశారు. దీంతో ఈ కథనం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. భారత్ వ్యాప్తంగా నెటిజన్లు ఆ తల్లులను ప్రశంసిస్తున్నారు.
భారత ఆర్మీ నిర్వహించిన ఈ మెరుపు దాడుల్లో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మూసూద్ అజహర్ కుటుంబంలోని 14 మంది హతం అయ్యారు.












Click it and Unblock the Notifications