చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Sisters: ఇంట్లో వారం నుంచి తల్లి శవం ముందు చేతిలో బైబిల్ పెట్టుకుని ప్రార్థనలు చేస్తున్న కూతుర్లు !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ తిరుచ్చి: ప్రభుత్వ టీచర్ గా పని చేసిన మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విపరీతమైన దైవ భక్తి ఉన్న ఇద్దరు కూతుర్లకు ఇంకా వివాహం కాలేదు. రిటైడ్ అయిన టీచర్ ఊరి శివార్లలో సొంత ఇల్లు కట్టుకుని ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవిస్తోంది. కొంతకాలంగా అనారోగ్యంతో రిటైడ్ టీచర్ బాదపడుతోంది. ఇద్దరు కూతుర్లు ఆమెకు వైద్యపరీక్షలు చేయిస్తున్నారు. వారం రోజుల క్రితం రిటైడ్ టీచర్ అనారోగ్యంతో చనిపోయింది. వారం రోజుల నుంచి తల్లి శవాన్ని ఇంట్లో పెట్టుకున్న ఆమె కూతుర్లు బైబిల్ చేతిలో పట్టుకుని ప్రార్థనలు చేస్తున్నారు. వారం రోజుల నుంచి రిటైడ్ టీచర్ తో పాటు ఆమె ఇద్దరు కూతుర్లు మొబైల్ ఫోన్ లు స్విచ్ ఆఫ్ వచ్చాయి. దగ్గర బంధువులు రిటైడ్ టీచర్ ఆరోగ్యం గురించి ఆరా తియ్యాలని ఆమె ఇంటికి వెళ్లారు. ఇంట్లో కుళ్లిపోయిన లేడీ టీచర్ శవం చూసి వారు బిత్తరపోయారు. మా అమ్మా చనిపోలేదని, వారంలో తిరిగి వస్తుందని, అంత్యక్రియలు చెయ్యడానికి వీలు లేదని ఇద్దరు కూతుర్లు బంధువులతో గొడవపడ్డారు. పోలీసులు వెళ్లిన సమయంలో ఇద్దరు కూతుర్లు చెప్పిన మాటలకు ఆ ప్రాంతం ప్రజలు హడలిపోయారు.

Illegal affair: బెడ్ రూమ్ లో ఆంటీని నరికి చంపేసిన భర్త, పరువు పోతుందని, పక్కింటోళ్లకు చెప్పి !Illegal affair: బెడ్ రూమ్ లో ఆంటీని నరికి చంపేసిన భర్త, పరువు పోతుందని, పక్కింటోళ్లకు చెప్పి !

 రిటైడ్ టీచర్ కు ఇద్దరు కూతుర్లు

రిటైడ్ టీచర్ కు ఇద్దరు కూతుర్లు

తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలోని మనప్పరాయ్ ప్రాంతంలో మేరీ అనే మహిళ నివాసం ఉంటున్నారు. ప్రభుత్వ టీచర్ గా పని చేసిన మేరీకి జంసిత (43), జయంతి (40) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విపరీతమైన దైవ భక్తి ఉన్న మేరీ కుమార్తెలు జంసిత, జయంతికి ఇంకా వివాహం కాలేదు. మేరీ ప్రభుత్వ టీచర్ గా రిటైడ్ అయ్యారు.

ఊరి బయట సొంత ఇల్లు

ఊరి బయట సొంత ఇల్లు

మేరీ రిటైడ్ అయిన తరువాత వచ్చిన డబ్బుతో సోక్కంపట్టి పట్టణం సమీపంలో సొంత ఇంటిని నిర్మించుకుని కూతుర్లు జంసిత, జయంతితో కలిసి జీవనం సాగిస్తోంది. కొంతకాలంగా అనారోగ్యంతో రిటైడ్ టీచర్ మేరీ బాదపడుతోంది. కూతుర్లు జయంతి, జంసిత కొంతకాలంగా మేరీకి వైద్యపరీక్షలు చేయిస్తున్నారు.

తల్లి శవం ఇంట్లో పెట్టుకుని వారం నుంచి ప్రార్థనలు

తల్లి శవం ఇంట్లో పెట్టుకుని వారం నుంచి ప్రార్థనలు

మేరీ బంధువులు కొంతకాలం నుంచి ఆమె కూతుర్లకు ఫోన్లు చేసి ఆమె ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకుంటున్నారు. వారం రోజుల క్రితం రిటైడ్ టీచర్ మేరీ అనారోగ్యంతో చనిపోయింది. వారం రోజుల నుంచి తల్లి శవాన్ని ఇంట్లో పెట్టుకున్న ఆమె కూతుర్లు జయంతి, జంసిత బైబిల్ చేతిలో పట్టుకుని తల్లి శవం ముందు కుర్చుని ఆమె తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు.

బంధువులకు అనుమానం

బంధువులకు అనుమానం

పుదుచ్చేరిలో నివాసం ఉంటున్న మేరీ బంధువులు వారం రోజుల నుంచి ఆమెకు ఫోన్లు చేస్తున్నా ఫోన్ మాత్రం కనెక్ట్ కాలేదు. వారం రోజుల నుంచి రిటైడ్ టీచర్ మేరీతో పాటు ఆమె ఇద్దరు కూతుర్లు జంసిత, జయంతి మొబైల్ ఫోన్ లు స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తున్నాయి అనే అనుమానంతో పుదుచ్చేరి నుంచి నేరుగా మేరీ నివాసం ఉంటున్న ఇంటి దగ్గరకు వెళ్లి చూసి హడలిపోయారు.

మా అమ్మ తిరిగి వస్తుంది.... మీరు వెళ్లిపోండి

మా అమ్మ తిరిగి వస్తుంది.... మీరు వెళ్లిపోండి

ఇంట్లో కుళ్లిపోయిన లేడీ టీచర్ మేరీ శవం చూసి బంధువులు బిత్తరపోయారు. కుళ్లిపోయిన శవం ఇంట్లో పెట్టుకోకూడదని, అంత్యక్రియలు జరిపించాలని బంధవులు మేరీ కూతుర్లకు చెప్పారు. మా అమ్మ మేరీ చనిపోలేదని, వారంలో ఆమె తిరిగి వస్తుందని, అంత్యక్రియలు చెయ్యడానికి వీలులేదని, మర్యాదగా మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆమె ఇద్దరు కూతుర్లు బంధువులతో గొడవపడ్డారు.

మా అమ్మ చనిపోలేదు.... దేవుడు వారంలో తిరిగి పంపిస్తాడు

మా అమ్మ చనిపోలేదు.... దేవుడు వారంలో తిరిగి పంపిస్తాడు

మేరీ బంధువులు స్థానికులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మేరీ శవం తరలించడానికి ప్రయత్నించడంతో ఆమె ఇద్దరు కూతుర్లు అడ్డుకున్నారు. మేరీ కూతుర్లకు నచ్చచెప్పిన పోలీసులు బలవంతంగా శవాన్ని తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మేరీ ఎలా చనిపోయిందని పోలీసులు ఆరా తీస్తే మా అమ్మ నిజంగా చనిపోతే కదా మీకు ఎలా చనిపోయిందో చెప్పడానికి, వారంలో దేవుడు ఆమెను ఇక్కడికి తిరిగి పంపిస్తాడని జయంతి, జంసిత చెప్పడంతో స్థానికులు హడలిపోయారు.

హడలిపోయిన స్థానికులు

హడలిపోయిన స్థానికులు


మేరీ శవం కుళ్లిపోయిందని, దుర్వాసన వస్తున్నా ఆమె కూతుర్లు బైబిల్ చేతిలో పట్టుకుని ప్రార్థనలు చేస్తుూనే ఉన్నారని పోలీసులు అన్నారు. మేరీ అనారోగ్యంతోనే చనిపోయిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. వారం రోజుల క్రితం తల్లి చనిపోయినా మూడనమ్మకాలతో ఆమె తిరిగిరావాలని కూతుర్లు ప్రార్థనలు చెయ్యడం తమిళనాడులో కలకలం రేపింది.

English summary
Sisters: Two Sisters who kept Mothers Dead body for 7 days and prayer near Trichy in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X