సెక్స్ స్యాండల్ కేసు, లుక్ ఔట్ నోటీసులు జారీ, కనపడితే అంతే కథ, కనపడకపోయినా అంతే!
కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన లైగింక వేధింపుల పెన్ డ్రైవ్ కేసులో ప్రస్తుతం హాసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పరారీలో ఉన్నారు. లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన జేడీఎస్ పార్టీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సిట్ అధికారులు లుకౌట్ నోటీసు జారీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడు, హాసన్ లోక్‌సభ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ కోసం అధికారులు వేట మొదలుపెట్టారు.
కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ అధికారం దుర్వినియోగం చేశారంటూ రేవణ్ణ ఇంట్లో పనిచేసిన బాధితురాలు ఇప్పటికే ఫిర్యాదు చేసింది. అలాగే ఈ కేసును విచారించేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ బృందం ఇప్పటికే హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసు, లైంగిక వేదింపుల కేసు దర్యాప్తును వేగవంతం చేసింది.

కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో వేలాది మంది మహిళల జీవితాలకు న్యాయం జరగాలని కాంగ్రెస్ ఆందోళన చేస్తోంది. హాసన్ జిల్లాలోని హలేనరసీపుర పట్టణంలో ఇప్పటికీ నమోదైన కేసులో జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్.డీ. రేవణ్ణ, ఆయన కుమారుడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు కాకముందే ఏప్రిల్ 26వ తేదీన ఓటు వేసిన తర్వాత కూడా ప్రజ్వల్ రేవణ్ణ దేశం విడిచి పారిపోయాడని ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్ డీ రేవణ్ణకు నోటీసులు జారీ చేసినప్పటికీ ఇద్దరూ విచారణకు హాజరుకాలేదని సిట్ అధికారులు తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణ కోసం అధికారులు గాలిస్తున్నారు. కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల వేడిని పైకి కనపడకుండా, ఎన్నికల ప్రచారం కంటే ఎక్కువగా జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసు వ్యవహారం హాట్ టాపిక్ లో ఉంది.
ప్రజ్వల్ రేవణ్ణ పెన్ డ్రైవ్ కేసు వ్యవహారం కర్ణాటకలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల ప్రచారం కంటే ఇదే ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. హాసన్ లోక్ సభ నియోజకవర్గ కూటమి అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీలో ఉన్నాడని సిట్ అధికారులకు సమాచారం అందింది. ప్రజ్వల్ కోసం గాలిస్తున్న అధికారులు చివరికి అతనిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేయడం ఇప్పుడు కర్ణాటకలో కలకలం రేపుతోంది.

భారతదేశంతో పాటు పలు దేశాల్లోని విమానాశ్రయ అధికారులు, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు సిట్ జారీ చేసిన లుక్ ఔట్ నోటీసులు పంపించారని వెలుగు చూసింది. లుక్ ఔట్ నోటీసుల జారీ చేసిన తర్వాత కూడా ప్రజ్వల్ రేవణ్ణ ఆచూకీ లభించకుంటే అతన్ని పట్టుకోవడానికి కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
గతంలో తన న్యాయవాది అరుణ్ జీ ద్వారా విచారణకు హాజరు కావాలని అనుకున్న ప్రజ్వల్ రేవణ్ణ తనకు 7 రోజులు సమయం కావాలని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్)కు మనవి చేశారని తెలిసింది. విదేశాల్తో ఉంటున్న ప్రజ్వల్ రేవణ్ణ మే 15వ తేదీన భారత్ కు తిరిగి వస్తారని తెలిసింది. జేడీఎస్ ఎంపీ ప్రజల్వ్ రేవణ్ణ విదేశాల నుంచి వచ్చిన వెంటనే ఆయన్ను ఎయిర్ పోర్టులోనే అరెస్టు చేసే అవకాశం ఉందని తెలిసింది.
-
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications