సెక్స్ స్యాండల్ కేసు, తండ్రీ కొడుకులను నోటీసులు, 24 గంటలు డెడ్ లైన్, విదేశాల్లో ఉంటే?
అశ్లీల వీడియోల పెన్ డ్రైవ్ కేసులో హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి, మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణలకు సిట్ భారీ షాక్ ఇచ్చింది. మంగళవారం నోటీసు జారీ చేసి 24 గంటల్లో హాజరుకావాలని సిట్ అధికారులు తండ్రీ కొడుకును ఆదేశించింది. సెక్స్ స్యాండల్ పెన్ డ్రైవ్ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ ప్రారంభించిన అధికారులు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణలకు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.
వచ్చే 24 గంటల్లోగా వ్యక్తిగతంగా హాజరుకావాలని ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్ డీ రేవణ్ణకు సిట్ ఆదేశాలు జారీ చెయ్యడం కర్ణాటక రాజకీయాలను కుదిపేసింది. లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో జేడీఎస్ వ్యవహారంతో బీజేపీకి తలనొప్పి మొదలైయ్యింది. ఇప్పటికే విదేశాలకు పారిపోయాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసు వ్యవహారం రసవత్తరంగా మారిపోయింది. విదేశాల్లో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ 24 గంటల్లో హాజరుకావాలని సిట్ నోటీసు ఇవ్వడం రాజకీయంగా కలకలం రేపింది.

వందలాది మంది మహిళలు, యువతులపై అత్యాచారం చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలను ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి రేవణ్ణ ఎలా స్పందిస్తారో వేచి చూడాలని కొందరు నాయకులు అంటున్నారు. సెక్స్ స్యాండల్ కేసులో హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను విచారణ చెయ్యడానికి సిట్ నోటీసులు జారీ చేసింది. అశ్లీల వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్ బయటకు రావడంతో కర్ణాటక ప్రభుత్వం కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అప్పగించింది.
కేసు దర్యాప్తును స్వీకరించిన సిట్ అధికారులు సోమవారం హసన్ జిల్లాలో ఓ మహిళా పోలీసు అధికారి సహాయంతో ఐదుగురు బాధితులను విచారించారు. కేసును క్షుణ్ణంగా పరిశీలించారు. ఇప్పుడు మంగళవారం ప్రజ్వల్ రేవణ్ణ, హెచ్‌డీ రేవణ్ణలు స్వయంగా హాజరుకావాలని ఆదేశిస్తూ సిట్ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగించడంతో నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయాడని ఆరోపణలు ఉన్నాయి.

ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి, మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ మీడియాతో మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతోనే నాలుగు ఐదేళ్ల నాటి క్రితం కేసును ఇప్పుడు బయటకు తీసుకొచ్చారన్నారు. ఇది కుట్ర అని రేవణ్ణ ఆరోపించారు. ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడ ఉన్నారు అని చర్చ మొదలైయ్యింది. ప్రజ్వల్ రేవణ్ణ హాసన్, అరసికెరెతో సహా పలుచోట్ల మహిళలపై లైగింక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారంలో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు, కాంగ్రెస్ నిరసనలతో ఈ కేసు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చాలా హాట్ టాపిక్ అయ్యింది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ జేడీఎస్ నాయకులు, ప్రజ్వల్ రేవణ్ణ అనుచరులు ధర్నా చేశారు. దీనికి తోడు జీడీఎస్-బీజేపీ కూటమి నేతలు, ప్రధాని నరేంద్ర మోదీకి ధీటుగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేస్తూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కేసు కర్ణాటక రాజకీయాల్లో రసవత్తరంగా మారింది.












Click it and Unblock the Notifications