Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సెక్స్ స్కాండల్ కేసులో ట్విస్ట్, ఎంపీ పాస్ పోర్టు రద్దు చెయ్యండి, కేంద్ర ప్రభుత్వానికి షాక్ !

హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ చిక్కుల్లో పడ్డారు. లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పాస్‌పోర్టును వెంటనే రద్దు చేయాలని కోరుతూ సిట్ కేంద్ర హోం శాఖ అధికారుకు లేఖ రాసింది. ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపులు, అత్యాచారం కేసును విచారిస్తున్న సిట్ అధికారులు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేఖ రాయడం హాట్ టాపిక్ అయ్యింది.

ప్రజ్వల్ రేవణ్ణ విదేశాల్లో తలదాచుకుంటున్నాడు. జేడీఎస్ పార్టీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారి అయ్యింది. ప్రజ్వల్ రేవణ్ణపై జారీ చేసిన బ్లూ కార్నర్ నోటీసు, అరెస్ట్ వారెంట్‌ను సూచిస్తూ సిట్ అధికారులు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ప్రజ్వల్ రేవణ్ణ పాస్‌పోర్టును వెంటనే రద్దు చేయాలని సిట్ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశారు. ప్రజ్వల్‌పై చర్యకు అభ్యంతరం లేదని ఇప్పటికే కొందరు బీజేపీ నాయకులు తెలిపారు.

SIT officials write to Union Ministry of External Affairs to cancel Prajwal Revanna s passport

విదేశాల్లో తలదాచుకున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అతనిపై మూడు కేసులు నమోదు అయ్యాయి. కేసు దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. హెడీ రేవణ్ణకు కోర్టు బెయిల్ మంజూరు చేసినా.. సిట్ విచారణకు నోటీసు ఇచ్చినా ప్రజ్వల్ రేవణ్ణ విచారణకు హాజరు కాలేదు. ప్రజ్వల్ రేవణ్ణను భారతదేశానికి రప్పించేందుకు సిట్ పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రజ్వల్ రేవణ్ణకు చెందిన బ్యాంకు ఖాతాలను రద్దు చెయ్యాని, ఆయన పాస్‌పోర్ట్‌లను రద్దు చేయ్యాలని సిట్ అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజ్వల్ రేవణ్ణ పాస్‌పోర్ట్‌ను రద్దు చెయ్యాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సిట్ ఇప్పుడు లేఖ రాయడం కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో హాసన్ నియోజకవర్గానికి బీజేపీ-జేడీఎస్ కూటమి ఏకాభిప్రాయ అభ్యర్థిగా ప్రజ్వల్ రేవణ్ణ పేరు ప్రకటించింది.

ఏప్రిల్ 26వ తేదీన హాసన్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ఓటు వేసిన ప్రజ్వల్ రేవణ్ణ తరువాత దేశం విడిచి పారిపోయాడు. అప్పటి నుంచి ప్రజ్వల్ రేవణ్ణ కోసం సిట్ అధికారులు వెతుకుతున్నారు. మే 18వ తేదీన శనివారం బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ప్రజ్వల్ రేవణ్ణకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ప్రజ్వల్ రేవణ్ణ విదేశాల్లో ఉన్నట్లు సమాచారం. అతడి అరెస్ట్‌కు వారెంట్‌ జారీ చేయాలని సిట్‌ కోర్టును ఆశ్రయించింది.

ఈ పిటిషన్‌ను విచారించిన ప్రత్యేక కోర్టు ప్రజ్వల్ రేవణ్ణ అరెస్టుకు వారెంట్ జారీ చేసింది. ఇప్పుడు ఈ వారెంట్‌తోపాటు ఇప్పటికే జారీ చేసిన బ్లూ కార్నర్ నోటీసు గురించి ప్రస్తావించిన సిట్ అధికారులు ప్రజ్వల్ రేవణ్ణ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని కేంద్ర విదేశాంగ కార్యాలయానికి లేఖ రాసింది. సోమవారం మీడియాతో మాట్లాడిన కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ డిప్లమాటిక్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీని కోరారని అన్నారు.

ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం కోర్టు వారెంట్‌తో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అధికారికంగా లేఖ రాసిందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర విదేశాంగ అధికారులు ప్రజ్వల్ రేవణ్ణ పాస్‌పోర్ట్ ను రద్దు చేయాలని, అతని మీద అధికారులు చర్యలు తీసుకోవాలని కర్ణాటక హొం మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ అన్నారు.మొత్తం మీద హాసన్ ఎంపీ ప్రజల్వ్ రేవణ్ణ వ్యవహారం రోజురోజుకు అనేక మలుపులు తిరగడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+