1984 నాటి కేసు: మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్‌కు కొత్త చిక్కులు
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్‌కు కొత్త చిక్కులు ఎదురయ్యాయి. 1984లో చెలరేగిన సిక్కు అల్లర్లతో ఆయనకు సంబంధం ఉందంటూ నమోదైన కేసును సిట్ పునర్ విచారణ చేపట్టేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా అనుమతిచ్చింది.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మరణం తర్వాత 1984లో ఢిల్లీలోని రికబ్ గంజ్ గురుద్వారా బయట జరిగిన అల్లర్లలో కమల్ నాథ్ పాల్గొన్నారని శిరోమణి అకాళిదళ్ నేత మంజీందర్ ఎస్ సిర్సా ఆరోపించారు. అంతేగాక, ఈ మేరకు సాక్ష్యం చెప్పేందుకు ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారని అన్నారు. వారిద్దరూ సిట్ ఎప్పుడు పిలిచినా వచ్చి వాంగ్మూలం ఇస్తారని చెప్పారు.
సిట్ అధికారులతో మాట్లాడామని, వారు ఏదో ఒక తేదీని చెబుతామని చెప్పారని తెలిపారు. కీలకంగా ఉన్న ఆ ఇద్దరు సాక్షులకు తగిన భద్రత కల్పించాలని సిర్సా కోరారు. సిక్కులకు న్యాయం జరగాలంటే కమల్ నాథ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా విజ్ఞప్తి చేశారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications