వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషాదం: కరోనాతో సీపీఎం నేత ఏచూరి కుమారుడి కన్నుమూత,ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత మృతి

|
Google Oneindia TeluguNews

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో కన్నుమూశారు. ఈ విషయాన్ని సీతారాం ఏచూరి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'నా పెద్ద కొడుకుని కోల్పోయానని చెప్పేందుకు నేను చాలా చింతిస్తున్నాను. కోవిడ్‌తో ఈ ఉదయమే నా పెద్ద కొడుకు ఆశిష్ మృతి చెందాడు. ఈ కష్టకాలంలో మాకు అండగా నిలిచిన వైద్యులు,నర్సులు,ఫ్రంట్ లైన్ వర్కర్స్,శానిటేషన్ వర్కర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను...' అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత,ఢిల్లీ మాజీ మంత్రి ఏకె వాలియా(72) కూడా కరోనాతో మృతి చెందారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన... ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.

Sitaram Yechurys son Ashish Yechury Former Delhi minister Dr AK Walia dies of covid 19

1993లో రాజకీయాల్లోకి వచ్చిన ఏకె వాలియా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడుసార్లు గీతా కాలనీ నుంచి ఒకసారి లక్ష్మీ నగర్ స్థానం నుంచి గెలుపొందారు. షీలా దీక్షిత్ హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. 2017లో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలకు ముందు ఆయన పార్టీని వీడారు. ఢిల్లీలోనే పుట్టి పెరిగిన వాలియా.. ఇండోర్‌లోని ఎంజీఎం మెడికల్ కాలేజీ నుంచి 1972లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. వృత్తి రీత్యా ఆయన ఫిజీషియన్. తూర్పు ఢిల్లీలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో ఆయన సొంత క్లినిక్ నిర్వహిస్తున్నారు.

ఇటీవలే ఉత్తరప్రదేశ్ మంత్రి హనుమాన్ మిశ్రా కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. గత ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు కరోనాతో మృతి చెందారు. కరోనా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో దేశంలో మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రతీరోజూ వేల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 2023 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

ఇప్పటికే దాదాపుగా అన్ని ఆస్పత్రులు కరోనా పేషెంట్లతో కిక్కిరిసిపోతున్నాయి. ఆస్పత్రుల్లో పడకలు దొరక్క... ఆక్సిజన్ అందక పేషెంట్లు విలవిల్లాడిపోతున్నారు. భారత్‌లో పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండటంతో ఇప్పటికే పలు దేశాలు భారత్‌కు విమాన రాకపోకలను నిలిపివేశాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్,కర్ఫ్యూ ఆంక్షలు పాటిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు ఇంకెలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

English summary
CPIM leader Sitaram Yechury's son Ashish Yechury passes away due to Covid-19. In a tweet, the politician said, "It is with great sadness that I have to inform that I lost my elder son, Ashish Yechury to COVID-19 this morning. I want to thank all those who gave us hope and who treated him - doctors, nurses, frontline health workers, sanitation workers and innumerable others who stood by us."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X