సుమలత దెబ్బకు సతమతం, అయోమయంలో నడ్డా, ఏం జరిగినా వదిలే ప్రసక్తలేదు, రెబల్ స్టార్ ఫ్యాన్స్ !
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మొండిగా వ్యవహరిస్తున్న సుమలత అంబరీష్ వ్యవహారంలో ఏం చెయ్యాలో తెలీక బీజేపీ హైకమాండ్ సతమతం అవుతోందని తెలిసింది. ఈ విషయంలో మండ్య లోక్‌సభ నియోజకవర్గంలోని బలమైన నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారని తెలిసింది. ఇప్పటికే బీజేపీ నాయకులు మండ్య, హాసన్, కోలార్ లోక్ సభ నియోజక వర్గాలను జేడీఎస్ కు ఇచ్చేసింది.
కోలారు, హాసన్, మండ్యలో పోటీ చేస్తుందని మాజీ సీఎం కుమారస్వామి ప్రకటించారు. మాజీ సీఎం కుమారస్వామి మా పార్టీ అభ్యర్థి మండ్యలో పోటీ చేస్తారని ప్రకటించిన తరువాత కూడా మండ్య సిట్టింగ్ ఎంపీ సుమలత మాత్రం తాను మండ్యను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని సంచలన వ్యాఖ్యలు చెయ్యడం కలకలం రేపింది. 2019 లోక్‌సభ ఎన్నికల వేళ మండ్యలో జరిగిన సంకేతాలన్నీ ఈసారి కూడా కనిపిస్తున్నాయి.

సుమలత ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమై మండ్య లోక్‌సభ నియోజకవర్గం టికెట్ కోసం డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సుమలత నేను పోటీ చేయకున్నా పర్వాలేదని, మండ్యలో బీజేపీ అభ్యర్థి మాత్రం పోటీ చేయాలని అన్నారు. మండ్యలో పోటీ చేస్తే అట్టడుగు స్థాయి నుంచి బీజేపీని బలోపేతం చెయ్యడానికి అవకాశం ఉంటుందని సుమలత అన్నారు.
అప్పటికీ నేను ఏ కారణం చేతనైనా బీజేపీని వీడే ప్రసక్తే లేదని, లోక్‌సభ పదవీకాలం ముగిసిన తర్వాత అధికారికంగా బీజేపీలో చేరుతానని, మండ్య విషయంలో తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మండ్యలోని కార్యకర్తలను విడిచిపెట్టే ప్రసక్తే లేదని సుమలత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ స్వయంగా తనకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, మండ్యలో తన పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, మీరు ప్రశాంతంగా ఉండండి, ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదని జేపీ నడ్డా కూడా అన్నారని సుమలత మీడియాకు చెప్పారు.

మీలాంటి నాయకులు పార్టీకి అవసరమని జేపీ నడ్డా తనతో అన్నారని సుమలత వివరించారు. చిక్కబళ్లాపూరం లోక్‌సభ నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేస్తున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సుమలత సమాధానం ఇచ్చారు. ఏ నియోజకవర్గం ఖాళీగా ఉంటే దానికి నా పేరును జతచేస్తున్నారని, పోయినసారి పార్టీలకతీతంగా మండ్యలో తనకు అండగా అందరూ నిలిచారని, అంబరీష్ అభిమానులు తనకు తోడుగా ఉన్నారని సుమలత గుర్తు చేశారు.
ప్రధాని మోదీ తన కార్యాలయం నుంచి ఫోన్ చేసి అమిత్ షాతో సమావేశమై మాట్లాడాలని తనకు చెప్పారని, తరువాత మండ్యలో క్షేత్రస్థాయికి వెళ్లి కార్యకర్తలతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటానని మండ్య ఎంపీ సుమలత మీడియాకు చెప్పారు. మండ్య లోక్ సభ నియోజక వర్గం జేడీఎస్ కు ఇచ్చేసిన తరువాత కూడా సుమలత మొండిగా తనకు అక్కడే ఎంపీ సీటు కావాలని పట్టుబట్టడం బీజేపీ నాయకులకు పెద్ద తలనొప్పిగా తయారైయ్యిందని తెలిసింది.
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
బీహార్ నూతన సీఎం గా అనూహ్య ఎంపిక, నితీశ్ 'ఫిక్స్' - మోదీ మార్క్ నిర్ణయాలు..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం












Click it and Unblock the Notifications