నాకు రాజకీయ జీవితం ఏదైనా ఉందంటే అది అక్కడే, ఎవరు ఎన్ని చెప్పినా అదే నామాట !
లోక్‌సభ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. 2019లో మండ్య లోక్ సభ ఎన్నికలు మాదిరిగానే ఈసారి కూడా మండ్యలో పార్టీ టిక్కెట్ల కోసం తీవ్ర పోటీ కలిగి ఉన్న నియోజకవర్గం అయ్యింది. కాంగ్రెస్‌కు సవాల్ విసిరేందుకు సిద్దం అయిన బీజేపీ, జేడీఎస్ పార్టీల కూటమిలో లోక్ సభ ఎన్నికల టిక్కెట్లు కేటాయించక ముందే వాగ్వాదం చోటుచేసుకుంది.
మండ్య లోక్‌సభ టిక్కెట్ కోసం జేడీఎస్ పార్టీకి, సిట్టింగ్ ఎంపీ సుమలత అంబరీష్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నియోజకవర్గాల కేటాయింపు విషయమై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి బీజేపీ హైకమాండ్‌తో పలు దఫాలుగా ఇప్పటికే చర్చలు జరిపారు. అయితే ఒక్కసారి కూడా జేడీఎస్‌కు ఇచ్చే నియోజకవర్గాలను బీజేపీ హైకమాండ్ అధికారికంగా ప్రకటించలేదు. దోస్తీ కారణంగా మండ్య, హాసన్, కోలార్ నుంచి జేడీఎస్ పోటీ చేస్తుందని మాజీ సీఎం కుమారస్వామి ఇప్పటికే ప్రకటించారు.

అయితే ప్రస్తుత మండ్య ఎంపీ సుమలత మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మండ్యను విడిచిపెట్టబోనని పలుమార్లు ఆశ్చర్యకరమైన ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి చికిత్స కోసం చెన్నై వెలుతున్న సమయంలో జేడీఎస్ పార్టీ అభ్యర్థులు మండ్య, హాసన్, కోలార్‌లో పోటీ చేస్తామని ప్రకటించారు. మార్చి 25వ తేదీన తాను బెంగళూరు వచ్చి అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తానని మాజీ సీఎం కుమారస్వామి చెప్పారు.
మండ్య ఎంపీ సుమలత అంబరీష్ ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమై చర్చలు జరిపారు. తరువాత సుమలత బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన మండ్య ఎంపీ సుమలత అంబరీష్ బాంబు పేల్చారు. మండ్య లోక్‌సభ నియోజక వర్గం టిక్కెట్ ఇంకా ఖరారు కాలేదని ఎంపీ సుమలత అంబరీష్ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్నారు.

ఢిల్లీలో పెద్దలతో మాట్లాడిన సుమలత మండ్య లోక్ సభ నియోజకవర్గానికి అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని, నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని తాను వారికి చెప్పినట్లు సుమలత మీడియాతో అన్నారు. మండ్య టికెట్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా అన్ని అంశాలను పరిశీలించి మార్చి 22వ తేదీన పేరు ప్రకటిస్తారని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర కూడా అదే మాట చెప్పారని సుమలత తెలిపారు.
చిక్కబళ్లాపురం నుంచి మీకు టికెట్ ఇచ్చారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సుమలత సమాధానమిస్తూ చిక్కబళ్లాపురం నియోజకవర్గం నాకు ఇవ్వాలని కొంత మంది బీజేపీ నాయకులు ప్రపోజ్ చేస్తున్నారని, దాని గురించి ఎవరూ తనతో ఇంత వరకు చర్చించలేదని, నేను బెంగళూరు ఉత్తర నియోజకవర్గాన్ని తిరస్కరించానని చెప్పారని, అలాంటి పమయంలో తాను చిక్కబళ్లాపురం నుంచి పోటీ చేస్తానని అంగీకరించడం ఎలా సాధ్యం అవుతుంది అని సుమలత మీడియాను ప్రశ్నించారు. నా రాజకీయం ఏదైనా ఉంటే అది మండ్యలో మాత్రమే అని సుమలత సంచలన వ్యాఖ్యలు చేశారు. సుమలత వ్యాఖ్యలతో మాజీ సీఎంహెచ్‌డీ కుమారస్వామికి ఇంకా ఆగ్రహాన్ని తెప్పించినట్లు అయ్యిందని జేడీఎస్ రాయకులు అంటున్నారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications