వివాదంలో అమిత్ షా, మఠాధిపతికి ఇచ్చే గౌరవం ఇదేనా, దక్షిణ భారతీయులంటే, వైరల్ !

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటక పర్యటనలో భాగంగా కర్ణాటకలోని ప్రసిద్ది చెందిన ఆదిచుంచనగిరి మఠంకు చెందిన మఠాధిపతి శ్రీ నిర్మాలానందనాథను కలిశారు.

బెంగళూరు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటక పర్యటనలో భాగంగా కర్ణాటకలోని ప్రసిద్ది చెందిన ఆదిచుంచనగిరి మఠంకు చెందిన మఠాధిపతి శ్రీ నిర్మాలానందనాథను కలిశారు. శ్రీ నిర్మాలానందనాథను కలిసిన సమయంలో అమిత్ షా ప్రవర్తించిన తీరుపై ఇప్పుడు సోషల్ మీడియాలో, నేరుగా తీవ్రస్థాయిలో విమర్శలు మొదలైనాయి.

ఒక్కలిగ కులస్థులు (గౌడ) దైవంతో సమానంగా భావించి శ్రీ నిర్మాలానందనాథను కలిసిన సమయంలో బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కాలు మీద కాలు వేసుకుని మాట్లాడారని, దక్షిణ భారతీయులు, మఠాధిపతికి మీరు ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నించారు.

Sitting posture Amit Shah in front of Nirmalananda Seer become controversy

శ్రీ నిర్మాలానందనాథ కుర్చున్న కుర్చీ పక్కనే దేవుళ్ల ఫోటోలు ఉన్నాయి. శ్రీ నిర్మాలానందనాథ, దేవుడి ఫోటోల వైపు కాలు చూపిస్తూ దర్జాగా కుర్చుని మాట్లాడిన మీరు హిందువులకు, హిందూ దేవుళ్లకు, దక్షిణ భారతదేశ ప్రజలకు ఎంత మాత్రం మర్యాద ఇస్తారో అర్థం అవుతుందని అమిత్ షాను ప్రశిస్తున్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చీఫ్, మాజీ ఎంపీ, బహుబాష నటి రమ్యా అయితే ఏకంగా బీజేపీ నాయకులు మఠాధిపతలకు ఎలాంటి మర్యాద ఇస్తారో అమిత్ షాను చూస్తే అర్థంఅవుతోందని కడిగిపారేశారు. ఒక్కలిగుల బ్రిగేడ్, పలు మఠాధిపతులు అమిత్ షా వైఖరిపై మండిపడుతున్నారు.

అయితే అదే ఒక్కలిగ కులానికి చెందిన బీజేపీ నాయకులు ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాకపోవడంతో ఎలాంటి వివరణ ఇవ్వాలి అని సతమతం అవుతున్నారు. శ్రీ నిర్మాలానందనాథ, అమిత్ షా కుర్చుని ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+