వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రయాన్-2లో అసలు కథ ఆరంభం: మిగిలింది అదొక్కటే..ఇక నేరుగా ల్యాండింగే!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ ప్రాజెక్టులో అసలు కథ మరి కొన్ని గంటల్లో ఆరంభం కానుంది. ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో పరిభమ్రిస్తోన్న చంద్రయాన్-2.. తన మలిదశకు చేరుకుంది. చంద్రుడి చివరి కక్ష్యలో ప్రవేశించనుంది. సోమవారం మధ్యహ్నం 12:45 నుంచి 1:45 నిమిషాల మధ్యన చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ ను జాబిల్లి చివరి కక్ష్యలో ప్రవేశించేలా సంకేతాలు పంపుతామని ఇస్రో అధికారులు వెల్లడించారు. అదే సమయంలో చంద్రునిపై కలియ తిరిగే విక్రమ్ ల్యాండర్ ను మోసుకెళ్తోన్న స్పేస్ క్రాఫ్ట్ దీని నుంచి విడిపోతుంది. చంద్రయాన్-2ను ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ నుంచి శాస్తవ్రేత్తలు మాడ్యూల్ గమనాన్ని నిర్దేశించారు.

జాబిల్లి కక్ష్యలో ప్రస్తుతం చంద్రయాన్-2 చందమామ ఉపరితలానికి దగ్గరగా 119 కిలోమీటర్లు, 127 కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తోందని తెలిపారు. జాబిల్లికి 119 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాడ్యూల్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయి చంద్రుడి చివరి కక్ష్యలో పరిభ్రమించేలా చర్యలు చేపడతారు శాస్తవ్రేత్తలు. మంగళ, బుధవారాల్లో.. అంటే వచ్చే 48 గంటల పాటు ఆర్బిటర్‌ లో పరిభ్రమిస్తూ ఉండే విక్రమ్ ల్యాండర్‌ను చందమామకు మరింత చేరువగా తీసుకెళ్తారు. ఈ రెండు చర్యల ద్వారా విక్రమ్ ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధృవం వైపు కదులుతుంది. అనంతరం ఈ నెల 7వ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 నుంచి 2:30 గంటల మధ్య విక్రమ్ ల్యాండర్ నుంచి రోవర్ విడిపోయి జాబిల్లి మీద అడుగు పెడుతుంది. చివరిదశ పరిభ్రమణ సమయంలోనే ఈ స్పేస్ క్రాఫ్ట్ వీడిపోతుంది. విక్రమ్ ల్యాండర్ ను చివరిదశ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తరువాత.. దానితో సంబంధాలను కోల్పోతుంది స్పేస్ క్రాఫ్ట్. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు.

Six days to landing, Chandrayaan 2 makes one last orbit around the moon

ఆ తరువాత ఇక నేరుగా ల్యాండింగే. చంద్రుడి దక్షిణ ధృవంపై స్పేస్ క్రాఫ్ట్ అడుగు మోపుతుంది. కిందటి నెల 22వ తేదీన నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణం సజావుగా సాగుతోందని శాస్త్రవేత్తలు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అంతరిక్షంలోకి వెళ్లిన కొద్దిరోజుల తరువాత భూగోళానికి సంబంధించిన కొన్ని తాజాగా ఫొటోలను పంపించింది. దీనితో- స్పేస్ క్రాఫ్ట్ పనితీరులో ఎలాంటి ఆటంకాలు ఏర్పడలేదని శాస్త్రవేత్తలు నిర్ధారించుకున్నారు. ఇక సాఫ్ట్ ల్యాండింగ్ పై వారు దృష్టి పెట్టారు. వచ్చేనెల 7వ తేదీన చోటు చేసుకునే సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన దశ అని వారంటున్నారు. నిర్దేశిత వేగాన్ని మించి ల్యాండర్ ప్రయాణం సాగిస్తే.. క్రాష్ ల్యాండింగ్ అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు.

English summary
Separation of lander Vikram from Chandrayaan 2 Orbiter is scheduled on September 2, between 12.45 p.m. and 1.45 p.m. IST.The Chandrayaan 2 spacecraft on September 1 evening underwent a small, fifth and final orbit manoeuvre to refine its circular path around the moon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X