Crime News: ఒకే ఇంట్లో ఆరు మృతదేహాలు.. హత్యా లేక ఆత్మహత్యా..
రాజస్థాన్ లోని ఉదయపూర్ జిల్లాలో ఓ ఇంట్లో ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి. గోల్-నేరి గ్రామంలో (ఝడోలి ప్రాంతం) ఓ ఇంట్లోని పడక గదిలో నలుగురు పసిపిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులలో నలుగురు సీలింగ్ ఫ్యాన్ ఉరివేసుకుని ఉన్నారు. మరో ఇద్దరు మంచం మీద పడి ఉన్నారు.

రోజువారీ కూలీ
గ్రామస్తుల సమాచారంతో గోగుండ ఠాణా పోలీసులు ఈ తెల్లవారుజామున తలుపులు తెరిచారు. మృతులు దంపతులు ప్రకాష్ గామేటి (35), అతని భార్య దుర్గ, 32, నలుగురు పిల్లలు గణేష్, పుష్కర్, రోషన్, నాలుగు నెలల పాపగా గుర్తించినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. దీన్ని సామూహిక ఆత్మహత్యల కేసుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వీరి కుటుంబం కొన్ని నెలల క్రితం గుజరాత్ నుంచి తిరిగి వచ్చింది. ప్రకాష్ స్థానికంగా ఒక ప్రైవేట్ కిచెన్‌లో రోజువారీ కూలీగా పని చేస్తున్నాడు.

పోస్ట్‌మార్టం
మొత్తం ఆరుగురి మృతదేహాలను పోలీసులు పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. ఆర్థిక కారణాల వల్లే కుటుంబంతో సహా ప్రకాష్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రకాశ్ మొదట కుటుంబ సభ్యులను చంపి ఆ తర్వాత ప్రకాష్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు.

విచారణ
ఒకే ఇంట్లో ఆరుగురు చనిపోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అతని బంధువులను విచారిస్తున్నారు. ఇది ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ పోలీసులు రెండు కోణాల్లో విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications