వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ ఉచితంగా కటింగ్, షేవింగ్ , షరతులు వర్తిస్తాయి, ఎందుకంటే?

ఆడపిల్లలను చంపకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఓ క్షురకుడు వినూత్నంగా ఆలోచించాడు. ఆడపిల్లలకు ఆరుమాసాలపాటు తన సెలూన్ లో ఉచితంగా కటింగ్ చేయనున్నట్టు ప్రకటించాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బీద్ :ఆడపిల్లలు పుడితే చంపడం, గర్భంలో ఉండగానే ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ చేసుకోవడం ఘటనలు చోటుచేసుకొంటున్నాయి.అయితే మహరాష్ట్రలోని బీద్ జిల్లాలో ఆడపిల్ల అంటే చంపివేస్తారనే ప్రచారం ఈ గ్రామస్థులకు ఉంది. దీంతో ఈ గ్రామానికి చెందిన ఓ క్షురకుడు వినూత్న ఆలోచనకుశ్రీకారం చుట్టాడు. ఆడపిల్లలకు ఉచితంగా ఆరుమాసాల పాటు కటింగ్ చేస్తానని ప్రకటించారు.

ఆడపిల్ల పుడితే చంపడం, ఆడపిల్లల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. మహరాష్ట్రలోని బీద్ జిల్లాలోని కుభేఫల్ గ్రామంలో ఆడపిల్లలని తెలిస్తే గర్భంలోనే చంపుతారు.ఈ అపవాదు ఈ గ్రామస్థులకు ఉంది.

ఈ గ్రామానికి చెందిన ఆశోక్ పవార్ అనే క్షురకుండు వినూత్నంగా ఆలోచించాడు. ఈ మేరకు ఆడపిల్ల పుట్టిన తండ్రికి ఆరుమాసాల పాటు ఉచితంగా షేవింగ్, కటింగ్ చేస్తానని ప్రకటించాడు. మరో వైపు ఆడపిల్లకు కూడ ఆరుమాసాలపాటు ఉచితంగా కటింగ్ చేస్తానని హమీ ఇచ్చాడు.

 six months free cutting for girls in maharastra

ఆడపిల్ల పుడితే పుట్టువెంట్రుకల నుండి ఆరుమాసాల పాటు ఉచితంగా కటింగ్ చేస్తానని ఆయన ప్రకటించాడు. ఈ మేరకు తన దుకాణం వద్ద ఓ చిన్న బోర్డును ఏర్పాటు చేశాడు. పవార్.

ఆడపిల్ల అంటే వద్దనుకొనే తల్లిదండ్రుల్లో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే తాను ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆశోక్ పవార్ చెబుతున్నారు. అయితే ఈ ఏడాది జనవరి 1వ, తేది తర్వాత గ్రామంలో ఎవరికి ఆడపిల్ల పుట్టిన తాను ఉచితంగా కటింగ్ చేస్తానని ప్రకటించాడు.

అయితే తొలుత 15 మందికి మాత్రం ఉచితంగానే కటింగ్ చేస్తానని ప్రకటించాడు. పదిహేను మంది తర్వాత వారికి రూ.50 చెల్లించాలని ఆయన ప్రకటించారు.ఆడపిల్ల పుడితే ఖర్చులు పెరిగిపోతాయని బావించే వారికి ఖర్చులు తగ్గించే ఉద్దేశ్యంతోనే తాను ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ప్రకటించారు ఆశోక్ పవార్.

English summary
sixmonths free cutting for girls in maharastra ,ashok pawar working a barber, he introduced in his saloon for free cutting for girls,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X