దారుణం... ఆర్నెళ్ల గర్భిణిపై ముగ్గురి గ్యాంగ్ రేప్-డిన్నర్ తర్వాత వాకింగ్ చేస్తున్న సమయంలో కిడ్నాప్
బిహార్‌లో దారుణం జరిగింది. 24 ఏళ్ల ఓ గర్భిణిపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. రాత్రిపూట భోజనం తర్వాత ఇంటి సమీపంలో వాకింగ్ చేస్తున్న సమయంలో ముగ్గురు దుండగులు ఆమెను అపహరించారు. సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లి ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అనంతరం ఆమెను పాట్నా రైల్వే జంక్షన్‌లో విడిచిపెట్టేందుకు వెళ్లిన సమయంలో పోలీసులు వారిని పట్టుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అసలేం జరిగింది
పాట్నాలోని బేర్ ప్రాంతంలో ఓ యువతి తన భర్త,అత్త మామలతో కలిసి నివసిస్తోంది. ప్రస్తుతం ఆమె ఆర్నెళ్ల గర్భంతో ఉంది. శనివారం(సెప్టెంబర్ 25) రాత్రి డిన్నర్ తర్వాత... ఇంటి బయట అలా వాకింగ్ చేసేందుకు వెళ్లింది. ఇంటి నుంచి కొద్ది దూరం వెళ్లాక... గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఆమె నోరు మూసి కిడ్నాప్ చేశారు. ఆపై సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు ఆమెపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు.అత్యాచార సమయంలో ఆమె ఎంతగా రోధించినా,బతిమాలినా వారు విడిచిపెట్టలేదు.

ఇలా వెలుగులోకి... ఇద్దరి అరెస్ట్...
గ్యాంగ్ రేప్ తర్వాత తెల్లవారుజామున 4గంటల సమయంలో నిందితులు యువతిని పాట్నా రైల్వే జంక్షన్‌కు తీసుకొచ్చారు. ఆ సమయంలో యువతి ఏడుస్తుండటాన్ని కొంతమంది ప్రయాణికులు గుర్తించారు.వారు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో... పోలీసులు ఆ యువతి వద్దకు వచ్చి ఆరా తీశారు. ఆ యువతి తనపై అత్యాచారం జరిగిందని చెప్పడంతో ఆమెతో పాటే ఉన్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు అప్పటికే పరారయ్యాడు.అరెస్టయిన నిందితుల పేర్లను విశాల్ కుమార్(21),అంకిత్ కుమార్(19),శ్యామ్ కుమార్‌లుగా గుర్తించారు. ఈ ముగ్గురు ఆ యువతి ఇంటికి సమీపంలోనే ఉంటారని గుర్తించారు.

బాధితురాలు ఆస్పత్రికి తరలింపు
నిందితులతో పాటు యువతిని కూడా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేసిన అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై స్థానిక పోలీస్ అధికారి కిశోర్ షాచారి మాట్లాడుతూ... బాధిత యువతి ఉన్నత కుటుంబానికి చెందినదని తెలిపారు. ఆమె భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు చెప్పారు.అత్త,మామ,భర్తతో కలిసి బేర్ ప్రాంతంలోని ఇంట్లో ఆమె నివసిస్తోందన్నారు.శనివారం రాత్రి డిన్నర్ తర్వాత ఆమె బయటకెళ్లగా... ముగ్గురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని తెలిపారు.ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు.
Recommended Video

బిహార్‌లో మహిళలపై నేరాల చిట్టా...
నేషనల్ క్రైమ్ బ్యూరో గణాంకాల ప్రకారం... బిహార్‌లో 2019తో పోలిస్తే 2020లో మహిళలపై నేరాల సంఖ్య 17.3శాతం మేర తగ్గింది. అదే సమయంలో అత్యాచార ఘటనలు మాత్రం 10.7శాతం పెరిగాయి. 2019లో బిహార్‌లో 730 మంది అత్యాచారాలకు గురవగా 2020లో 806 మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. మరో 110 అత్యాచారయత్నం కేసులు,లైంగిక దాడులు జరిపే ఉద్దేశంతో 584 దాడులు జరిగాయి. మొత్తంగా మహిళలపై నేరాలకు సంబంధించి గతేడాది బిహార్‌లో 15,359 కేసులు నమోదయ్యాయి.ఇందులో 6671 కిడ్నాప్ కేసులు ఉన్నాయి. మహిళల కిడ్నాప్ విషయంలో యూపీ 9109,పశ్చిమ బెంగాల్ 7740 ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications