AP IIIT Merit List 2026: ఏపీ ట్రిపుల్ ఐటీ మెరిట్ లిస్ట్..! ఇలా చెక్ చేసుకోండి..!

ఏపీలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో (AP IIIT) ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధుల మెరిట్ జాబితా ఇవాళ విడుదలైంది. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ఐఐఐటీ క్యాంపస్‌లలో ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సులో ప్రవేశాల కోసం ఈ మెరిట్ లిస్ట్ విడుదల చేశారు.

ఈ ఏడాది ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తులు మే 1 నుంచి మే 30 వరకు తీసుకున్నారు. వీటి ఆధారంగా ఇవాళ మెరిట్ లిస్ట్ ప్రకటిస్తున్నారు. ఆన్ లైన్ లో మెరిట్ లిస్ట్ అప్ లోడ్ కాగానే అభ్యర్ధులు ఆర్జీయూకేటీ అధికారిక వెబ్ సైట్లు అయిన
https://rgukt.in/ లేదా https://admissions.rgukt.in/ లోకి వెళ్లి ఫలితాలు తెలుసుకోవచ్చు. వీటి ఆధారంగానే ఆ తర్వాత కౌన్సిలింగ్ నిర్వహించి అడ్మిషన్లను కేటాయిస్తారు.

AP IIIT Admissions 2026 Merit List Release today Here s How to Check

ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీల్ని కూడా ఇప్పటికే ప్రకటించారు. వీటి ప్రకారం నూజివీడు & ఆర్.కె. వ్యాలీ క్యాంపస్‌ల్లో 19-20 జూన్ 2026, ఒంగోలు & శ్రీకాకుళం క్యాంపస్‌లలో 22-23 జూన్ సర్ఠిఫికెట్ల ధృవీకరణ ఉంటుంది. అనంతరం అడ్మిషన్లను కేటాయిస్తారు. గత ఏడాది ట్రిపుల్ ఐటీల్లో జూలై 15న తరగతులు ప్రారంభం కాగా, ఈసారి 15 రోజుల ముందుగానే అంటే జూలై 1 నుంచే పీయూసీ-1 తరగతులను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే పాత విద్యార్థులకు జూన్ 29 నుంచే విద్యా సంవత్సరం (2026-27) మొదలవుతున్నందున, కొత్త విద్యార్థులు కూడా వారితో పాటే అకడమిక్ క్యాలెండర్‌ను అనుసరించేలా ఈ మార్పు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+