150 ఏళ్ల తర్వాత సింహాసనంపై యువరాణి.. 20 ఏళ్లకే దేశాన్ని ఏలే రాజకుమారి

చూపుతిప్పుకోలేని అందం, కళ్లలో ఒక రకమైన ఆత్మవిశ్వాసం, మాటలో రాజసం, నడకలో మిలిటరీ డిసిప్లిన్.. ఇదీ స్పెయిన్ కాబోయే మహారాణి గురించి ఇప్పుడు ప్రపంచం చర్చించుకుంటున్న మాటలు ! వయసు కేవలం 20 ఏళ్లే, కానీ ఆమె సాధించిన విజయం, పొందిన శిక్షణ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఏకంగా ఎనిమిది భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్.. ఇలా అన్నింటిలోనూ సైనిక శిక్షణ పూర్తి చేసుకుంది. దాదాపు 150 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత స్పెయిన్ దేశానికి మహారాణిగా బాధ్యతలు చేపడుతున్న తొలి మహిళగా లియోనోర్ చరిత్ర సృష్టించబోతోంది.

అదృష్టంతో పాటూ చట్టం కలిసి వచ్చిన క్షణం

నిజానికి స్పెయిన్ రాజ్యాంగ చట్టాల ప్రకారం.. రాజుకి కొడుకు పుడితే, అతడికే వారసత్వ హక్కులు ఎక్కువగా వెళ్తాయి. రాజకుమారి కంటే చిన్నవాడైనా సరే మగపిల్లాడికే కిరీటం దక్కుతుంది. ఈ రోజుల్లోనూ ఇదే పద్ధతి అక్కడ కొనసాగుతోంది. అయితే లియోనోర్ తండ్రి, ప్రస్తుత రాజు ఫెలిపేకు ఇద్దరూ కుమార్తెలలోనే (లియోనోర్, సోఫియా) పుట్టారు. కొడుకు పుడితే తన వారసత్వానికి ఎక్కడ గండి పడుతుందో అని, రాజు దంపతులు మూడో సంతానానికి వెళ్లలేదని రాయల్ సర్కిల్స్ లో టాక్ ఉంది. ఏది ఏమైనా, రాజ్యాంగంలోని ఈ లొసుగులు ఏవీ ఆమె రాజయోగం ముందు నిలవలేకపోయాయి.

Meet Spain s Future Queen Princess Leonor Speaks 8 Languages amp amp Finishes Triple Military Training at 20

ఆకాశమే హద్దుగా.. సైన్యంలో రికార్డులు!

18 ఏళ్లు నిండగానే దేశ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి తన బాధ్యతలను అధికారికంగా ప్రారంభించింది లియోనోర్. ఆ తర్వాత మొదలైంది అసలైన లీడర్ షిప్ ట్రైనింగ్! సైన్యంలోని మూడు విభాగాల్లోనూ ఫైవ్ స్టార్ కేడెట్‌గా కఠినమైన శిక్షణ తీసుకుంది. సుదీర్ఘమైన సముద్ర ప్రయాణాలు, పారాచూట్ డైవింగ్స్, చివరికి తండ్రితో కలిసి యుద్ధ విమానాలు నడపడం వరకు దేనినీ వదల్లేదు. రాజ కుటుంబంలో పారాచూట్ కోర్సు పూర్తి చేసిన ఏకైక వ్యక్తిగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. రీసెంట్ గానే ఆమెకి అత్యున్నత సైనిక పురస్కారాలతో పాటూ ఆఫీసర్ ర్యాంక్ కూడా ఇచ్చారు.

చదువు, రాజ బాధ్యతలు ఒకేసారి

ఇక చదువు విషయంలోనూ ఆమె రూటే వేరు. వేల్స్ లో అంతర్జాతీయ విద్యను పూర్తి చేసిన లియోనోర్, త్వరలోనే మాడ్రిడ్ లోని ప్రముఖ యూనివర్సిటీలో 'పొలిటికల్ సైన్స్' డిగ్రీలో చేరబోతోంది. ఒకవైపు కాలేజ్ చదువుకుంటూనే, ఇంకోవైపు దేశ రాజకార్యాలను, అధికారిక వేడుకలను పర్యవేక్షించనుంది. భవిష్యత్తులో దేశాన్ని పాలించే సరైన అర్హతలన్నీ చిన్న వయసులోనే సొంతం చేసుకుంటూ, ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా చేస్తోంది ఈ ఆల్ రౌండర్ యువరాణి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+