నింగిలోకి సూపర్ హెవీ వెయిట్ రాకెట్- ఒకచోట పడాల్సింది ఇంకోచోట పడింది.. !!
అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్.. మరో నూతన మైలురాయిని అందుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, శక్తివంతమైన రాకెట్ స్టార్‌షిప్ 13వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున 4:21 నిమిషాలకు అమెరికాలోని టెక్సాస్ బోకా చికా లాంచింగ్ స్టేషన్ నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
ఇప్పటివరకు ఎవరూ రూపొందించడానికి కూడా సాహసించని భారీ రాకెట్ ఇది. రెండో ప్రయత్నంలో విజయం సాధించింది. రెండు వారాల కిందటే దీన్ని ప్రయోగించాలని స్పేస్‌ఎక్స్ ఏర్పాట్లు చేసినప్పటికీ.. ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో తాత్కాలికంగా వాయిదా వేసింది. తాజాగా దీన్ని నింగిలోకి పంపించింది. చంద్రుడు, అంగారక గ్రహంపైకి మనుషులతో పాటు భారీ పరిమాణంలో సరుకులను మోసుకెళ్లడానికి స్పేస్‌ఎక్స్ ఈ రాకెట్ కు రూపకల్పన చేసింది.

ఈ ప్రయోగంలో భాగంగా నెక్స్ట్ జెన్ స్టార్‌లింక్ వెర్షన్ 3 ఇంటర్నెట్ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఏకంగా 20 సబ్ ఆర్బిటల్ శాటిలైట్స్ ను ఈ రాకెట్ తీసుకెళ్లింది. గాల్లోకి లేచిన సుమారు రెండు నిమిషాల తర్వాత ప్రధాన అంతరిక్ష నౌక నుండి సూపర్ హెవీ బూస్టర్ విజయవంతంగా విడిపోయింది. ఈ బూస్టర్‌ను గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో సురక్షితంగా, ల్యాండ్ చేయాలనే విషయంలో పాక్షికంగా బెడిసికొట్టింది. గల్ఫ్ ఆఫ్ మెక్సికోకు బదులుగా హిందూమహాసముద్రంలో ఇది ల్యాండ్ అయింది.
బూస్టర్ 20 తిరిగి భూమికి చేరే క్రమంలో అమర్చిన ర్యాప్టర్ ఇంజిన్లు ఇగ్నిషన్ సమస్యను ఎదుర్కొన్నాయి. అనుకున్న విధంగా ఇంజిన్ బర్న్ కాలేదు. దీంతో కంట్రోల్డ్ ల్యాండింగ్ సాధ్యం కాలేదు స్పేస్ ఎక్స్ కు. అదే సమయంలో స్టార్‌షిప్ స్పేస్ షిప్ మాత్రం రోదసీలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. అక్కడ ఇంజిన్లను ఆపివేసి కొంత సమయం పాటు కోస్టింగ్ దశను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
ఈ కోస్టింగ్ సమయంలోనే స్టార్‌షిప్.. తాను మోసుకొచ్చిన స్టార్‌లింక్ శాటిలైట్లను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అవన్నీ కూడా అంతరిక్షంలో వాటికవే విచ్చుకున్నాయి. సోలార్ ప్యానెల్స్ ఓపెన్ కావడం, అత్యాధునిక లేజర్ సిస్టమ్ ను విజయవంతంగా పరీక్షించడం వంటి ప్రక్రియలను పూర్తి చేసుకున్నాయి. ఇది.. స్పేస్‌ఎక్స్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది.
🔥 LET'S GO! SpaceX just SUCCESSFULLY launched Starship from Starbase—the 13th Starship flight—as they get closer and closer to securing a RE-USABLE rocket the size of a 40-STORY building
— Nick Sortor (@nicksortor) July 24, 2026
Only in America, baby! 🇺🇸
Congratulations to @elonmusk and the SpaceX team pic.twitter.com/HcDdBZPYZm
అనంతరం ఈ రాకెట్.. భూ వాతావరణంలోకి విజయవంతంగా ప్రవేశించింది. గంట తర్వాత తీవ్ర వేడితో కూడుకున్న వాతావరణం మధ్య పీడనాన్ని తట్టుకుంటూ స్టార్‌షిప్ హిందూ మహాసముద్రంలో ల్యాండ్ అయింది. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ల్యాండ్ అయ్యేలా ప్లాన్ చేస్తే.. అది అనూహ్యంగా హిందూ మహాసముద్రంలో దిగింది. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఎలాన్ మస్క్ హర్షం వ్యక్తం చేశారు. నాసా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆర్టెమిస్ మూన్ మిషన్ కు కీలకం అవుతుందని వ్యాఖ్యానించారు. చంద్రుడు, అంగారక గ్రహాలపైకి హెవీ పేలోడ్స్ ను తీసుకెళ్లగమని అన్నారు.
SpaceX's next-gen V3 Starship Heavy Booster has splashed down in the ocean as planned. Landing velocity was a bit high. pic.twitter.com/H6GiFsufHP
— Sawyer Merritt (@SawyerMerritt) July 24, 2026












Click it and Unblock the Notifications