ఏపీ, తెలంగాణ సహా ఈ ఆరు రాష్ట్రాల్లోనే పెట్రోలు ధరలు ఎక్కువ: ఎందుకంటే?
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ ధరలపై కేంద్రం కీలక విషయాలు వెల్లడించింది. బీజేపీయేతర ఆరు ష్ట్రాల్లో పెత్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గించలేదని కేంద్రం తెలిపింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి. ఈ మేరకు వివరాలను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ గురువారం లోక్‌సభలో వెల్లడించారు.

ఏపీ, తెలంగాణ సహా ఆరు జిల్లాల్లోనే పెట్రో ధరలెక్కువ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, జార్ఖండ్ రాష్ట్రాలు వ్యాట్ తగ్గించలేదని.. అందుకే ఈ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని హర్దీప్ సింగ్ పురీ గురువారం లోక్‌సభలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సంకాన్ని తగ్గించినట్లు ఆయన గుర్తు చేశారు. దీనికి కొనసాగింపుగా కొన్ని రాష్ట్రాలు ప్రజలపై భారం తగ్గించేందుకు వ్యాట్ ను కూడా తగ్గించాయిన తెలిపారు.

పెట్రోల్ ధరలు తక్కువున్న దేశాల జాబితాలోనే భారత్
కాగా, మంత్రి ఈ ప్రకటన చేస్తుండగా లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీల సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చౌకదగా పెట్రోల్ లభిస్తున్న దేశాల జాబితాలో భారత్ ఒకటని కేంద్రమంత్రి పురీ తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు భారీగా పెరగడం వల్ల దేశీయ ఆయిల్ మర్కెటింగ్ కంపెనీలు రూ. 27,276 కోట్ల నష్టాన్ని చవిచూసినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తమ తమ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గించేందుకు ఒప్పించాలని ప్రతిపక్ష పార్టీల లోక్‌సభ సభ్యులను హర్దీప్ సింగ్ పురీ కోరారు.

ముడి చమురు ధరలు పెరిగాయి.. ఖర్చులు కూడా
భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 85% కంటే ఎక్కువ దిగుమతి చేసుకుంటుందని పురీ చెప్పారు. అందువల్ల, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లోని వాటి సంబంధిత ధరలతో ముడిపడి ఉంటాయన్నారు. ముడి చమురు కొనుగోలు ధర, మారకం రేటు, షిప్పింగ్ ఛార్జీలు, అంతర్గత సరుకు రవాణా, రిఫైనరీ మార్జిన్, డీలర్ కమిషన్, కేంద్ర పన్నులు, రాష్ట్ర వ్యాట్, ఇతర వ్యయ అంశాలు వంటి వివిధ అంశాలపై ఆధారపడి పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు ఆధారపడి ఉన్నాయని కేంద్రమంత్రి వివరించారు.
నవంబర్ 2020, నవంబర్ 2022 మధ్య భారతీయ బాస్కెట్ క్రూడ్ ఆయిల్ సగటు ధర 102% ($43.34 నుంచి $87.55 వరకు) పెరిగినప్పటికీ, ఈ కాలంలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు వరుసగా 18.95%, 26.5% మాత్రమే పెరిగాయన్నారు.

ప్రజల కోసం పెట్రోల్ ధరలు పెంచడం లేదన్న కేంద్రం
అంతర్జాతీయంగా రికార్డు స్థాయిలో ధరలు పెరిగినప్పటికీ 2022 ఏప్రిల్ 6 నుంచి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓంఎసీలు) పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదని మంత్రి తెలిపారు. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో కంపెనీలు రూ. 27,276 కోట్ల నష్టాల్ని చవిచూసినట్లు తెలిపారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరల ప్రభావం సామాన్య ప్రజలపై ఉండొద్దనే కేంద్రం రెండుసార్లు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని వివరించారు. కేంద్రమంత్రి సమాధానంతో సంతృప్తి చెందని కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎన్సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.












Click it and Unblock the Notifications