6 ఏళ్ల చిన్నారి కిడ్నాప్, లైంగికదాడి చేసి.. గుర్తుపడుతుందోనని కంటిపై దాడి, మొహంపై కూడా...
నవ భారతం అత్యాచార భారత్‌గా మారుతుందా అనే సందేహాం కలుగుతోంది. కళ్లు మూసుకొన్న కామాంధులు.. చిన్నపిల్లలపై కూడా లైంగికదాడి చేస్తున్నారు. నిర్భయ లాంటి కఠినచట్టాలు తీసుకొచ్చినా.. మృగాళ్లలో మార్పురాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘటన పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఆరేళ్ల చిన్నారి..
దామోహ్ జిల్లాలో ఓ ఆరేళ్ల బాలిక తన స్నేహితులతో కలిసి బుధవారం సాయంత్రం తన ఇంటి వద్ద ఆడుకుంటోంది. ఇంతలో ఆగంతకుడు వచ్చి బాలికను ఎత్తుకెళ్లిపోయాడు. అక్కడ ఆమెకు నరకం చూపించాడు. లైంగికదాడి చేయడమే గాక.. తనను ఎక్కడ గుర్తుపడుతుందోనని కంటిపై దాడి చేశాడు. మొహంపై కూడా దాడిచేసిన ఆనవాళ్లు కనిపించాయి. గురువారం ఉదయం గ్రామశివారులో బాలిక అపస్మారకస్థితిలో కనిపించింది. ఆమె రెండు చేతులను కట్టిపడేసి ఉండగా.. కంటిపై గాయం, మొహాంపై గాయం కనిపించాయి.

కంటికి ఆపరేషన్..
వెంటనే ఆ చిన్నారిని జబల్ పూర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి కండిషన్ సీరియస్‌గా ఉంది అని వైద్యులు చెబుతున్నారు. కంటికి శస్త్రచికిత్స చేస్తున్నామని వైద్యులు ప్రకటించారు. జరిగిన ఘటనపై సీఎం శివరాజ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. సీఎం ఆదేశాలతో బాలికపై దాడిచేసిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. అతని ఆచూకీ కోసం ముమ్మరంగా అన్వేషిస్తున్నాయి.

10 వేల రివార్డు..
బాలికపై దాడిచేసిన వ్యక్తికి సంబంధించి ఆచూకీ తెలిపితే రూ.10 వేల రివార్డు అందజేస్తామని పోలీసులు ప్రకటించారు. ఇప్పటికే కొందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని... త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు. 2012లో నిర్భయపై సామూహిక లైంగికదాడి తర్వాత దేశంలో లైంగికదాడి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే లైంగికదాడి గురైన ప్రతీ నలుగురిలో ఒకరు చిన్నారి ఉన్నారని గణాంకాలు తెలుపడం ఆందోళన కలిగిస్తోంది.
Recommended Video

కూతవేటు దూరంలో..
ఈ ఫిబ్రవరిలో దేశ రాజధాని ఢిల్లీలో అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో ఐదేళ్ల చిన్నారిపై 25 ఏళ్ల యువకుడు లైంగికదాడి చేసిన ఘటన కలవరానికి గురిచేసింది. గతేడాది నవంబర్ 27వ తేదీన హైదరాబాద్ శివారులో వెటర్నరీ డాక్టర్‌పై లైంగికదాడి, హత్య దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications