Viral Video: కార్యకర్తపై రాయి విసిరిన మంత్రి.. వీడియో వైరల్..

ప్రజాప్రతినిధులంటే ప్రజల ఆదర్శంగా నిలవాలి. ప్రజలకు మంచి మాటలు చెప్పాలి. ప్రజలు ఆవేశపడినా సమయమనంతో వ్యవహరించాలి. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థాయి హోదాలో ఉన్నవారు పిచ్చిగా ప్రవర్తిస్తే
ఏదో అనుకోవచ్చు.. కానీ మంత్రి పదవిలో ఉన్నవారు వీధి రౌడిలా వ్యవరిస్తే ఎలా ఉంటుంది. ఇక్కడ అదే జరిగింది.

తమిళనాడులో ఓ మంత్రి వీధి రౌడిలా ప్రవర్తించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ మంత్రి కార్యకర్తపై రాయి ఎత్తడం చూడవచ్చు. అయితే అతను అలా ఎందుకు చేశాడో తెలిస్తే కూడా షాకవుతాం. కూర్చోడానికి కూర్చి తీసుకురావడం ఆలస్యమైందని కార్యకర్తపై రాయి విసిరాడు.

SM Nasar throws a stone at party workers in Tiruvallur in tamilanadu

తమిళనాడు మంత్రి ఎస్ఎం నాసర్ తిరువళ్లరులో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లారు. అయితే తను కూర్చోడానికి కూర్చి ఆలస్యంగా తీసుకురావడంతో కార్యకర్తపైకి రాయి విసిరారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మంత్రిపై తీవ్ర విమర్శాలు వస్తున్నాయి. మంత్రి పదవీలో ఉండి రౌడీల ప్రవర్తిస్తున్నాడని మండిపడుతున్నారు.

ఈ వీడియోపై నెటిజన్లు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమిళనాడా లేక కాశ్మీరా అంటూ ఒకరు కామెంట్ చేశారు. మరొకరు రాయి విసరడంలో మంత్రి నిశ్నాతులని కామెంట్ చేశారు. మీరు ఈ పదవికి యోగ్యమైన, తెలివిగల వారిని ఎందుకు నియమించకూడదు, వారు చాలా ముఖ్యమైన వారైతే వారికి పార్టీ పదవిని ఇవ్వండి, ఈ రకమైన సభ్యులు మీ ప్రతిష్టను దెబ్బ తీస్తారని తమిళనాడు సీఎంఓకు ట్యాగ్ చేస్తూ కామెంట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+