పుడ్ పార్క్ ఇష్యూ: అమేధిలో స్మృతి ఇరానీ, కార్పోరేట్ల కోసం రాహుల్ లాబీయింగ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంటరీ నియోజకవర్గమైన అమేధిలో కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ మంగళవారం పర్యటించారు. ఈ పర్యటనలో ఆమె రాహుల్ గాంధీ తన అడుగు జాడల్లో నడుస్తున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూపీఏ హయాంలోని 'ఫుడ్ పార్క్' ప్రాజెక్టును రద్దు చేయడంతో వేలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాకుండా పోయాయన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. రాహుల్ గాంధీ కార్పోరేట్ వర్గాల కోసం లాబీయింగ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు.
2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం భూమిని కేటాయించినప్పటికీ, ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి పనిని ప్రారంభించలేదని, భూమిని ఇచ్చిన ప్రజలకు ఎలాంటి పరిహారం కూడా చెల్లించలేదని పేర్కొన్నారు. పుడ్ పార్క్‌ని ఎందుకు రద్దు చేశారంటూ రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రధాని మోడీని నిలదీసిన సంగతి తెలిసిందే.

రాహుల్ గాంధీ గత మూడు నెలలుగా తన సొంత నియోజక వర్గంలో పర్యటిచంలేదని, రెండు నెలలు అజ్ఞాతంలో ఉండి వచ్చిన రాహుల్ అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులను కిసాన్ యాత్ర పేరుతో పరామర్శించడంలో ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు.
రాహుల్ పర్యటనను మీరు సందేహించవచ్చు కానీ, తన పర్యటనను కాదని మంత్రి స్కృతి ఇరానీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రతీకార రాజకీయాలు చేస్తున్నాయన్నారు. కాగా స్మృతి ఇరానీ అమేధి పర్యటన నేపథ్యంలో, మే 18 నుంచి రెండు రోజులపాటు పర్యటిస్తానని రాహుల్ ప్రకటించడం గమనార్హం.
ఇది ఇలా ఉంటే, గతేడాది జరిగిన లోకసభ ఎన్నికల్లో అమెధిలో రాహుల్ గాంధీపై పోటీ చేసి స్మృతి ఇరానీ ఓటమి పాలైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications