ఏపీ మీదుగా పట్టాలెక్కిన బెంగళూరు వందే భారత్ స్లీపర్: 8 హాల్ట్ స్టేషన్లు
దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల దూకుడు కొనసాగుతోంది. సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పలు రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి. సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు, వేగం.. వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది.
ఈ పరిణామాల మధ్య ఇక వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా పట్టాలెక్కుతున్నాయి. హౌరా-కామాఖ్య మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ ఇదివరకే అందుబాటులోకి రానుంది. దీన్ని మరింత విస్తరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. నూతన మార్గాల్లో వీటిని ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో మరో వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ నేడు పట్టాలెక్కింది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కొద్దిసేపటి కిందటే జెండా ఊపి ప్రారంభించారు.

- సర్ ఎం విశ్వేశ్వరాయ టెర్మినల్ బెంగళూరు- ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ ముంబై మధ్య రాకపోకలు సాగించే స్లీపర్ రైలు ఇది.
- సోమవారం మినహా మిగిలిన అన్ని రోజులూ సాయంత్రం 7:45 నిమిషాలకు బెంగళూరు నుంచి బయలుదేరే నంబర్ 27652 వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ మరుసటి రోజు ఉదయం 11:55 నిమిషాలకు ముంబైకి చేరుకుంటుంది.
- మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజులూ రాత్రి 8:10 నిమిషాలకు ముంబై నుంచి బయలుదేరే నంబర్ 27651 వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.
బెంగళూరు- ముంబై మధ్య ఎనిమిది స్టేషన్లల్లో మాత్రమే దీనికి హాల్ట్ సౌకర్యం ఉంది. ఇందులో ఏపీలో రెండు, కర్ణాటకలో మూడు, మహారాష్ట్రలో మూడు స్టేషన్లు ఉన్నాయి. బెంగళూరు నుంచి బయలుదేరే వందే భారత్ స్టీపర్ ఎక్స్ ప్రెస్ ఆ తర్వాత ఆగేది అనంతపురంలో మాత్రమే. దీని తర్వాత గుంతకల్లులో దీనికి హాల్ట్ సౌకర్యం ఉంది. అనంతరం రాయచూరు, యాద్గిర్, కలబురగి, షోలాపూర్, పూణె, కల్యాణ్ లల్లో ఆగుతుంది.













Click it and Unblock the Notifications
