కిడ్నాప్‌పై క్షేమంగా తిరిగొచ్చిన స్నాప్‌డీల్ ఉద్యోగిని
న్యూఢిల్లీ: కనిపించకుండా పోయిన దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్‌కు చెందిన ఉద్యోగిని దీప్తీ సర్నా(24) క్షేమంగా తిరిగొచ్చింది. దీప్తి శుక్రవారం ఉదయం ఫోన్ చేసి తాను క్షేమంగానే ఉన్నానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
గుర్గావ్‌లో బుధవారం సాయంత్రం దీప్తి తన కార్యాలయం నుంచి ఇంటికి వెళుతుండగా ఆమె అపహరణకు గురైంది. రోజూ మెట్రోలో వెళ్లే దీప్తి బుధవారం ఆటోలో ఇంటికి వెళుతున్న సమయంలో బెంగళూరులో ఉన్న తన స్నేహితురాలికి ఫోన్ చేసింది.

అప్పుడే ఆటో డ్రైవర్ రాంగ్ రూట్‌లో వెళుతున్నాడని అతనిపై అరుస్తున్నట్లు ఫోన్‌లో వినిపించిందని దీప్తి స్నేహితురాలు తెలిపింది. ప్రస్తుతం దీప్తి క్షేమంగానే ఉన్నట్లు తెలియడంతో స్నాప్‌డీల్ యాజమాన్యం, ఆమె కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, తాను ఆటోలో ఇంటికి వెళుతున్న సమయంలో నలుగురు తనను కిడ్నాప్ చేశారని దీప్తి తెలిపింది. తన కళ్లకు గంతలు కట్టు మీరట్ వరకు తీసుకెళ్లారని చెప్పింది. తనకు ఎలాంటి హాని తలపెట్టలేదని చెప్పింది. ఆ తర్వాత తనను నరేలా ప్రాంతంలో వదిలిపెట్టినట్లు దీప్తి తెలిపిందని సీనియర్ పోలీస్ అధికారి ధర్మేంద్ర సింగ్ తెలిపారు. అయితే, దీప్తి ఫోన్, బ్యాగ్ మిస్సయ్యాయని చెప్పారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications