Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓటువేసిన అన్నా హజారే, హీరాబెన్ ! 98 ఏళ్ల వయస్సులో..

ముంబై/అహ్మదాబాద్: ప్రముఖ సామాజిక కార్యకర్త, లోక్ పాల్ బిల్లు ఉద్యమకర్త అన్నా హజారే, ప్రధానమంత్రి నరేంద్రమోడీ తల్లి హీరాబెన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళవారం ఉదయం ఆయన మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లాలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

అనంతరం కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. పోలింగ్ సరళి పట్ల స్పందించడానికి నిరాకరించారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ప్రశ్నకు కూడా ఆయన సమాధానాన్ని దాటవేశారు. ప్రస్తుతం తాను రాజకీయాలేవీ మాట్లాడట్లేదని చెప్పారు.

Social activist Anna Hazare in Maharashtra and Narendra Modis mother, Heeraben in Gujarat cast their Votes

98 ఏళ్ల వయస్సులో..

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తల్లి హీరాబెన్ అహ్మదాబాద్ లో ఓటు వేశారు. 98 ఏళ్ల వయస్సులో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. అహ్మదాబాద్ లోని రైసన్ ప్రాంతంలో ఆమె ఓటు వేశారు.

Social activist Anna Hazare in Maharashtra and Narendra Modis mother, Heeraben in Gujarat cast their Votes

ఈ సందర్భంగా హీరాబెన్ వెంట.. ఆమె బంధువులు, భద్రతాధికారులు ఉన్నారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన వెంటనే.. అక్కడి సిబ్బంది హీరాబెన్ కు చప్పట్ల కొడుతూ స్వాగతం పలికారు. అంతకుముందు- ప్రధాని మోడీ తన తల్లి హీరాబెన్ ను కలిశారు. ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+