టెలిగ్రామ్ సంచలనం: కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా

టెలిగ్రామ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం సడన్ షాక్ ఇచ్చింది. ఈ సోషల్ మీడియా, మెసెజింగ్ ప్లాట్ ఫామ్ ను నిషేధించింది. వీటి కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి కూడా. ఈ మేరకు కేంద్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వచ్చాయి. దేశంలో నీట్ (NEET) పరీక్షల నిర్వహణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీనిపై మంగళవారం ఉత్తర్వులు సైతం వెలువడ్డాయి.

కేంద్రం నిర్ణయం పట్ల టెలిగ్రామ్ యాజమాన్యం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. నిషేధాన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఢిల్లీ హైకోర్టులో అత్యవసర పిటీషన్ దాఖలు చేసింది. ఈ అప్లికేషన్‌పై ప్రభుత్వం విధించిన ఆంక్షలు రాజ్యాంగ విరుద్ధమని, వెంటనే వాటిని తొలగించాలని కోరుతూ దాఖలైందీ పిటిషన్. భావ ప్రకటన స్వేచ్ఛను హరించినట్లుగా భావించాల్సి వస్తోందని, ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలకు భిన్నమని పేర్కొంది.

Telegram Challenges Centre s Temporary Ban Ahead of NEET UG Re Test Delhi High Court starts Hearingoday

ఈ పిటీషన్ ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ తేజస్ కరియా నేతృత్వంలోని సింగిల్ బెంచ్ తక్షణమే విచారణ చేపట్టనుంది. అత్యవసరంగా విచారించడానికి న్యాయమూర్తి అంగీకరించారు. నీట్ రీ-టెస్ట్ సమీపిస్తున్న ఈ కీలక తరుణంలో ఐటీ మంత్రిత్వ శాఖ తీసుకున్న తాత్కాలిక నిషేధ నిర్ణయం ఇటు విద్యార్థుల్లో, అటు సాంకేతిక నిపుణుల్లో తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో.. ఈ పిటీషన్ కు ఉన్న ప్రాధాన్యతను బెంచ్ గుర్తించినట్టయింది.

టెలిగ్రామ్ తరఫు న్యాయవాదులు కోర్టులో తమ వాదనలు వినిపించారు. పరీక్షల అక్రమాలను అరికట్టేందుకు ఒక యాప్‌ను పూర్తిగా నిషేధించడం సరైన పరిష్కారం కాదని పేర్కొన్నారు. ఈ తాత్కాలిక నిషేధం వల్ల దేశంలోని కోట్లాది మంది వినియోగదారులు సమాచార మార్పిడికి దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 21 పరీక్ష ప్రారంభం కావడానికి ముందే ఈ ఆంక్షలను రద్దు చేసి, యూజర్లకు సేవలను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది.

టెలిగ్రామ్‌పై ప్రభుత్వం రెండు రకాల నిషేధాలను విధించింది. అందులో భాగంగా మొదటి నిబంధన కింద, భారత్‌లో టెలిగ్రామ్ ప్లాట్‌ఫామ్ యాక్సెస్‌ను ఒక నిర్ణీత వ్యవధి కొరకు పరిమితం చేయనున్నారు. ఈ నిషేధం జూన్ 22వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. విద్యార్థులు ఎలాంటి తప్పుడు సమాచారానికి గురికాకుండా ఉండడానికి ఇది తోడ్పడుతుందని భావిస్తున్నారు. టెలిగ్రామ్‌ లో ఇప్పటికే అప్‌లోడ్ చేసిన పాత వాటిని ఎడిట్ చేసుకునే ప్రత్యేక సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం రెండో నిబంధన.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+