కాచిగూడకు వచ్చే ఎక్స్ ప్రెస్ రైలు టైమింగ్స్ భారీ మార్పు

ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గతంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ వస్తోన్నారు. ఏపీ, తెలంగాణల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు ఇవి. నర్సాపూర్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి వంటి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో మెజారిటీ రైలు సర్వీసులను పొడిగించారు. ప్రయాణికుల నుండి అపూర్వ ఆదరణ అందుతున్న నేపథ్యంలో తాజా చర్యలు తీసుకున్నారు.

ఈ పరిణామాల మధ్య నాగర్ కోయిల్- కాచిగూడ మధ్య రాకపోకలు సాగించే నంబర్ 16354 ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవి.. ఈ నెల 20వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. నాగర్ కోయిల్ నుండి కాచిగూడకు బయలుదేరే టైమ్ లోనే ఈ మార్పులు చోటు చేసుకోవడం వల్ల రన్నింగ్ స్టేటస్ మొత్తం కూడా మారిపోనుంది.

New Timings for Number 16354 Nagercoil-Kachguda Express Now Departs at 12 20 PM From June 20

లైన్ల ఆధునీకరణ, ఇతర కార్యాచరణ, సిగ్నలింగ్ అవసరాల దృష్ట్యా ఈ రైలు వేళలను సవరించాల్సి వచ్చిందని అధికారులు వివరణ ఇచ్చారు. దీని సమయాలను మార్చడం ఇది మొదటిసారి కాదు. ఈ రైలు సమయాన్ని మొదట ఉదయం 11:05 గంటలుగా నిర్ధారించారు. ఇప్పుడు ఆ సమయాన్ని మరింత పొడిగించారు గానీ అది అమలులోకి రాలేదు. వాటి స్థానంలో ఇప్పుడు మళ్లీ నూతన సమయాన్ని ఖరారు చేశారు.

తాజా సవరణ ప్రకారం.. నంబర్ 16354 ఎక్స్ ప్రెస్ ఈ నెల 20 నుంచి మధ్యాహ్నం 12: 20 నిమిషాలకు నాగర్ కోయిల్ నుంచి కాచిగూడకు బయలుదేరుతుంది. మొదట ఈ రైలు నాగర్ కోయిల్ నుంచి ఉదయం 9:25 నిమిషాలకు బయలుదేరుతుందని వెల్లడించారు. ఇందులో మార్పులు చేశారు. 11:05 నిమిషాలకు పొడిగించారు. ఈ రెండింటి తేదీ కూడా ఈ నెల 20 గానే నిర్ధారించారు. ఇప్పుడు తాజాగా మధ్యాహ్నం 12:20 నిమిషాలుగా ఖరారు చేశారు.

ఈ నెల 20న మధ్యాహ్నం 12:20 నిమిషాలకు నాగర్ కోయిల్ నుంచి బయలుదేరే నంబర్ 16354 ఎక్స్ ప్రెస్ వల్లియూర్, తిరునెల్వేలి, కోవిల్ పట్టి, మధురై, దిండిగల్, తిరుచిరాపల్లి, కరూరు, నామక్కల్, రాశిపురం, సేలం, జోలార్ పేట, వనియంబాడి, గుడియాత్తం, కాట్పాడి, చిత్తూరు, తిరుపతి, రేణిగుంట, కడప, తాడిపత్రి, గుత్తి, డోన్, కర్నూలు, గద్వాల, మహబూబ్ నగర్ మీదుగా కాచిగూడకు చేరుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+