హైదరాబాద్ లో వేగంగా విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధి..! వెంటనే ఇలా చేయకపోతే..!

హైదరాబాద్ మహానగరం విశ్వ నగరంలా మారుతోంది. రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. ఇక నిత్యం ఏదో ఒక పని మీద, ఉపాధి, ఉద్యోగాల కోసం వేల మంది హైదరాబాద్ కు వస్తుంటారు. వరల్డ్ పాపులేషన్ రివ్యూ అంచనా ప్రకారం హైదరాబాద్ లో జనాభా కోటికి పైగానే ఉంది. 2011 లో 67 లక్షలుగా ఉన్న హైదరాబాద్ జనాభా ఇప్పుడు కోటి దాటినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే హైదరాబాద్ లో ఇప్పుడు ఓ ప్రాణాంతక వ్యాధి సైలెంట్ గా విస్తరిస్తోంది. అదే కిడ్నీ వ్యాధి.. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ ప్రచురించిన ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం తెలంగాణలో క్రానిక్ కిడ్నీ వ్యాధితో మృతి చెందుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. కిడ్నీ వ్యాధి గ్రస్తుల్లో దేశంలోనే హైదరాబాద్ టాప్ ప్లేస్ లో ఉందని ఈ నివేదిక చెబుతోంది.

అటు గతేడాది హైదరాబాద్ లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్స్ నెఫ్రాలజిస్టులు ఇండియన్ జర్నల్ ఆఫ్ నెఫ్రాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నివేదికలో తెలంగాణలో ప్రతి 14 మందిలో ఒకరు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని తేలింది. ముఖ్యంగా హైదరాబాద్‌ లో ఈ కొత్త రకం కిడ్నీ వ్యాధులు పెరుగుతున్నట్లు వెల్లడైంది. అంతేకాక నగరంలోని యువత అత్యధికంగా ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు స్పష్టమైంది.

అంతేకాక ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనం మరో కీలక విషయాన్ని వెల్లడించింది. 2023 లో క్రానిక్ కిడ్నీ వ్యాధి కారణంగా హైదరాబాద్ లోని ప్రతి లక్ష మంది జనాభాలో 19.84 మంది మృతి చెందినట్లు నివేదించింది. ఈ డెత్ రేట్ క్రమంగా పెరుగుతూ వస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ప్రతి లక్ష జనాభాకు ఏకంగా 241. 57 మంది కిడ్నీ వ్యాధితో మృతి చెందుతున్నట్లు నివేదికలో పేర్కొంది. అయితే హరియాణాలో అత్యధికంగా ప్రతి లక్ష మంది జనాభాకు 316.35 మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు వెల్లడించింది. ఇక పంజాబ్, ఛత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లోనూ కిడ్నీ వ్యాధి కారణంగా డెత్ రేట్ అధికంగానే ఉన్నట్లు స్పష్టం చేసింది.

Hyderabad Tops the List for Kidney Diseases Once Again Alarming Health Trend Returns Hyd kidney

హైదరాబాద్ లోని నిమ్స్ కు ప్రతినెలా 500 నుంచి 600 మంది కిడ్నీ రోగులు వస్తున్నట్లు వెల్లడైంది. అలాగే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు కిడ్నీ వ్యాధి బారిన పడి మృతి చెందుతున్నట్లు నివేదిక పేర్కొంది. మృతుల్లో నాలుగోవంతు హైబీపీ, డయాబెటిస్ బారిన పడినవాళ్లే ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇక కిడ్నీల ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తగినంత నీరు (2.5-3 లీటర్లు) తాగాలని వైద్యులు చెబుతున్నారు. వైద్యుల సూచన లేకుండా పెయిన్‌ కిల్లర్లు, ఎనర్జీ డ్రింక్స్, ప్రోటీన్ పౌడర్‌ లను వినియోగించొద్దని వివరిస్తున్నారు. గ్రీన్ టీని ఎక్కువగా తాగడం వల్ల (రోజుకు హాఫ్ లీటర్ కంటే ఎక్కువ) కిడ్నీలు ఫెయిల్ అవుతాయని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+