కల్కి 2లో ఆలియా భట్? క్లారిటీ వచ్చేసింది!
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ అయిన కల్కి 2 గురించి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై చిత్ర బృందం తాజాగా స్పందించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తోందని.. హైదరాబాద్‌లో ఆమె 5 రోజుల షూటింగ్‌ను కూడా పూర్తి చేసిందంటూ గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అంతే కాకుండా ఆమె దీపికా పదుకొణె పోషించిన పాత్రలో కనిపించనుందని లేదా వైష్ణో దేవి అనే కొత్త పాత్ర ద్వారా ఈ ఫ్రాంచైజీలోకి ఎంట్రీ ఇస్తోందంటూ రకరకాల ఊహాగానాలు వ్యక్తమయ్యాయి.
అయితే ఈ వార్తలపై సినిమా బృందం అధికారికంగా క్లారిటీ ఇస్తూ ఆ పుకార్లను పూర్తిగా కొట్టిపారేసింది. ఆలియా భట్ ఈ ప్రాజెక్టులో భాగం కాలేదని.. అలాంటి షూటింగ్ ఏదీ జరగలేదని సినిమా ప్రతినిధి ఒకరు క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఎవరో ఒకరు చేసిన పోస్ట్ వైరల్ కావడం వల్ల ఈ తప్పుడు సమాచారం అందరికీ వ్యాపించిందని వివరించారు. కాబట్టి ఇలాంటి పుకార్లను ఎవరూ నమ్మవద్దని.. సినిమాకు సంబంధించిన అన్ని అప్‌డేట్లను అధికారిక ప్రకటనల ద్వారానే తెలుసుకోవాలని సినిమా యూనిట్ ప్రజలను కోరింది.

ప్రస్తుతం డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సీక్వెల్ కు సంబంధించిన కీలకమైన షెడ్యూల్స్‌పై దృష్టి సారించారు. ఇందులో భాగంగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక హీరో ప్రభాస్ ఆగస్టు 2026 నుంచి ఈ సినిమా షూటింగ్ లో పూర్తిస్థాయిలో పాల్గొనడానికి షెడ్యూల్ ఖరారైంది. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మైథాలజీ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications