Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దండుపాళ్యం స్ఫూర్తితో!: 50మందిపై టెక్కీ రేప్, సెల్‌ఫోన్ నిండా నగ్న చిత్రాలే, సంచలన కేసు

అలా ఇప్పటివరకు 50మంది మహిళలపై అతను అత్యాచారానికి పాల్పడినట్టు తేలింది.

Recommended Video

    సినిమాలో సీన్ చూసి 50మంది మహిళలపై రేప్, అది ఏ మూవీ అంటే ? | Oneindia Telugu

    చెన్నై: సినిమాల ప్రభావం కేవలం థియేటర్ నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపు మాత్రమే ఉంటుందా?.. లేక కొంతమందిని సుదీర్ఘ కాలం ప్రభావితమయ్యేలా చేస్తుందా?.. అంటే రెండింటిలోను దేనికి కచ్చితమైన సమాధానం చెప్పలేని పరిస్థితి.

    ఆమధ్య పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మొద్దు శీను తానో సినిమాలో సీన్ ను స్ఫూర్తిగా తీసుకుని హత్య చేశానని చెప్పి సంచలనం సృష్టించాడు. ఇప్పుడింకో యువకుడు దండుపాళ్యం అనే సినిమాను స్ఫూర్తిగా తీసుకుని మహిళలపై అత్యాచారాలకు తెగబడుతూ వస్తున్నాడు.

     ఎవరతను?:

    ఎవరతను?:

    మ్యాథ్స్‌లో పట్టభద్రుడై, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా బెంగళూరులో కొంతకాలం పనిచేసిన మదన్.. కొంతకాలం క్రితం జాబ్ కోల్పోయాడు. దీంతో బెంగుళూరులో జీవనం అతనికి కష్టంగా మారింది. వెంటనే చెన్నైకి మకాం మార్చి ఇక్కడ జాబ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎక్కడా జాబ్ దొరకకపోవడంతో ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు.

    ఓ కేసు విషయంలో దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులకు అనుకోని రీతిలో మదన్ అరివళగన్(28) అనే యువకుడు చిక్కాడు. విచారణలో భాగంగా పోలీసులు అతని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న డేటాను పరిశీలించగా పోలీసులకే షాక్ తిన్నంత పనైంది.

     మహిళల నగ్న చిత్రాలు:

    మహిళల నగ్న చిత్రాలు:

    ఆ సెల్ ఫోన్ మెమొరీ నిండా మహిళల నగ్న దృశ్యాలే ఉన్నాయి. చెన్నైలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలను అతను నగ్నంగా చిత్రీకరించినట్టు గుర్తించారు. దీనిపై మదన్ ను ఆరా తీయగా విస్తుపోయే విషయాలు వెల్లడించాడు. తాను మహిళలపై ఎలా అత్యాచారం చేసింది.. దానికి ఏది స్ఫూర్తినిచ్చింది వంటి విషయాలను వెల్లడించాడు.

     దండుపాళ్యం స్ఫూర్తితో:

    దండుపాళ్యం స్ఫూర్తితో:

    దండుపాళ్యం అనే సినిమాను మదన్ స్ఫూర్తిగా తీసుకుని అదే రీతిలో అత్యాచారాలకు తెగబడుతూ వస్తున్నాడు. పోలీసుల ముందు ఇదే విషయాన్ని అంగీకరించాడు. పగటి పూట బైక్ పై రెక్కీ నిర్వహించి ఒంటరిగా ఉండే మహిళల ఇళ్లను గుర్తించేవాడినని చెప్పాడు. ప్లాన్ ప్రకారం ఆ ఇంటికి వెళ్లి.. దాహమేస్తోందంటూ మంచినీళ్లు అడిగేవాడు.

     ఇప్పటివరకు 50మందిపై రేప్:

    ఇప్పటివరకు 50మందిపై రేప్:

    మంచినీళ్లు తీసుకురావడానికి వారు లోపలికి వెళ్లడమే ఆలస్యం.. కత్తి తీసుకుని వారితో పాటే లోపలికి చొరబడేవాడు. కత్తితో బెదిరించి నగలు దోచుకునేవాడు. అనంతరం వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఆపై తన సెల్ ఫోన్ లో వారిని నగ్నంగా చిత్రీకరించేవాడు.

    పోలీసులకు ఫిర్యాదు చేస్తే నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించేవాడు. అలా ఇప్పటివరకు 50మంది మహిళలపై అతను అత్యాచారానికి పాల్పడినట్టు తేలింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+