వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు: హత్య చేశారనేదానికి సరైన ఆధారాలు లేవని అభిప్రాయపడ్డ సీబీఐ కోర్టు

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి సోహ్రాబుద్దీన్, తులసీప్రజాపతి బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 22 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. వారిపై మోపబడిన అభియోగాలను రుజువు చేయడంలో సీబీఐ విఫలమైందని న్యాయస్థానం అభిప్రాయపడింది. సోహ్రాబుద్దీన్‌ది బూటకపు ఎన్‌కౌంటర్ అని నిరూపించడంలో సీబీఐ తగిన సాక్షాధారాలతో రుజువు చేయలేకపోయిందని న్యాయస్థానం పేర్కొంది.

ఈ కేసుకు సంబంధించి మొత్తం 22 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిలో ఎక్కువగా గుజరాత్, రాజస్థాన్‌లకు చెందిన జూనియర్ పోలీసులు ఉండటం విశేషం. సోహ్రాబుద్దీన్‌కు ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయన్న చెబుతూ అతన్నిపోలీసులు చంపి దాన్ని ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారని సీబీఐ పేర్కొంది. నవంబర్‌ 2005లో సోహ్రబుద్దీన్ బూటకపు ఎన్‌కౌంటర్ జరిగింది. సోహ్రాబుద్దీన్ మృతి చెందిన నెల రోజులకు అతని భార్య కౌసర్‌బీని కూడా హతమార్చడం జరిగింది. ఆ తర్వాత సోహ్రబుద్దీన్ మిత్రుడు ప్రజాపతిని కూడా డిసెంబర్ 2006లో ఎన్‌కౌంటర్ చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి 210 మంది సాక్షులను విచారణ చేశారు. ఈ నెల మొదట్లో కేసుకు సంబంధించి పూర్తి విచారణ చేయడం ముగిసింది. తీర్పును డిసెంబర్ 21కి రిజర్వ్ చేసింది సీబీఐ ప్రత్యేక కోర్టు.

Sohrabuddin encounter case: CBI court says proof not enough to prove murder

2010లో సోహ్రాబుద్దీన్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. ఆ సమయంలో 38 మందిపై కేసు నమోదు చేసింది. వీరిలో నాటి గుజరాత్ హోంమంత్రిగా ఉన్న ప్రస్తుత బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో పాటు గుజరాత్ రాజస్థాన్ పోలీస్ ఉన్నతాధికారులపై కేసు నమోదు చేశారు. అయితే 2013లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గుజరాత్ నుంచి ముంబైకి కేసు బదిలీ అయ్యింది. ఆ సమయంలో అమిత్ షా, గుజరాత్ పోలీస్ ఛీఫ్ పీసీ పాండే , యాంటీ టెర్రర్ స్క్వాడ్ ఛీఫ్ డీజీ వంజారాలతో పాటు మరో 16 మందికి క్లీన్ చిట్ వచ్చింది. అయితే తన సోదరుడిది బూటకపు ఎన్‌కౌంటర్ అని పేర్కొంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించాడు రుబాబుద్దీన్. అంతేకాదు డీజీ వంజారాతో పాటు మరో నలుగురు పోలీస్ ఉన్నతాధికారులకు ఊరటనివ్వడాన్ని బాంబే హైకోర్టులో సవాల్ చేయగా ఆయన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

English summary
A special CBI court in Mumbai on Friday said there is not enough proof to prove murder and has acquitted all 22 people in the Sohrabuddin Sheikh encounter case, according to news agency ANI.A total of 22 people, mostly junior officers of the Gujarat and Rajasthan police, were on trial for killing Shaikh, a gangster with alleged terror links, in an alleged fake encounter in November 2005. His wife Kausar Bi was also killed that month and his aide Tulsiram Prajapati shot dead in another encounter by the Gujarat and Rajasthan police in December 2006.The prosecution examined 210 witnesses, of which 92 turned hostile.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X