మందలించినందుకు కన్న తండ్రినే కిరాతకంగా చంపిన కొడుకు

ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకీ మరింత దిగజారిపోతున్నాయి అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. క్షణికావేశంలో కన్నవారిని సైతం కిరాతకంగా చంపుతుండడం సర్వత్రా సంచలనంగా మారుతోంది. ఇప్పటికే ఈ తరహా ఘటనలు ఎన్నో చోటు చేసుకోగా ఇప్పుడు ఇలాంటి ఘటనే మరొకటి సంచలనంగా మారింది.

దొంగ‌త‌నం ఎందుకు చేశావ్‌? అని మైన‌ర్ కుమారుడిని.. ప్రశ్నించడమే ఆ తండ్రి తప్పు అయ్యింది. మందలించింది తండ్రే కదా అని ఆ కొడుకు అనుకోలేదు. తండ్రి మీద కోపంతో ఇంట్లోని ఓ గ‌దిలో నిద్రిస్తున్న తండ్రికి నిప్పు పెట్టాడు. తప్పించుకోకుండా గది తలుపులు వేసేశాడు. దీంతో ఆ తండ్రి గ‌దిలోనే స‌జీవ‌ ద‌హ‌న‌మ‌య్యాడు. ఈ దారుణ ఘటన హర్యానాలోని ఫ‌రీదాబాద్ ‌లో చోటు చేసుకుంది.

son brutally killed his own father for reprimanding him

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫ‌రీదాబాద్‌లోని ఓ ఇంట్లో అలాం అన్సారీ నివసిస్తున్నాడు. అతనికి 14 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. గత మంగ‌ళ‌వారం నాడు త‌న ష‌ర్టు జేబులోంచి కొడుకు డ‌బ్బులు తీయ‌డంతో అన్సారీ అతనిని మందలించాడు. దీంతో కోపం పెంచుకున్న కుమారుడు అర్ధ‌రాత్రి 1:30 గంట‌ల‌ సమయంలో.. తండ్రి నిద్రిస్తుండగా నిప్పంటించి పరారయ్యాడు.

గ‌దిలోంచి అరుపులు వినిపించ‌డంతో స్థానికులు వెళ్లి చూసేస‌రికే అత‌డు ప్రాణాలు విడిచాడు. తాము చూస్తుండ‌గానే ఆ కుమారుడు ఇంటి గోడ దూకి పారిపోయాడని చెబుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. బాలుడిని అరెస్ట్ చేసినట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+