మొబైల్ లో హెచ్ జీ గేమ్స్, రీచార్జ్ కు డబ్బులు ఇవ్వలేదని తండ్రిని ముక్కలుగా నరికేశాడు!
బెంగళూరు: మొబైల్ లో హెచ్ జీ(HG)గేమ్స్ ఆడకూడదని బుద్దిమాటలు చెప్పిన కన్న తండ్రిని కొడుకు మూడు ముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశాడు. తండ్రి శంకరప్ప (59)ను హత్య చేసిన కొడుకు తరువాత మొబైల్ లో కరెన్సీ రీచార్జ్ చేసుకుని చక్కగా గేమ్స్ ఆడుకున్న ఘటన కర్ణాటకలోని బెళగావి నగరంలో జరిగింది.

రిటైడ్ ఏఎస్ఐ
మూడు నెలల క్రితం శంకరప్ప (59) ఏఎస్ఐగా రిటైడ్ అయ్యారు. శంకరప్ప కొడుకు రఘువీర్ కమ్మార్. రఘువీర్ కమ్మార్ నిత్యం మొబైల్ లో హెచ్ జీ గేమ్స్ ఆడేవాడు. మొబైల్ లో గేమ్స్ ఆడటానికి రఘువీర్ బానిస అయ్యాడు. ఆదివారం అతని మొబైల్ లో కరెన్సీ ఖాళీ అయ్యింది. మొబైల్ రీచార్జ్ చేయించాలని, తాను గేమ్స్ ఆడుకోవాలని రఘువీర్ తండ్రి శంకరప్పకు చెప్పాడు.

మొబైల్ రీచార్జ్ కు డబ్బు
నిత్యం పనిపాట చెయ్యకుండా మొబైల్ లో గేమ్స్ ఎందుకు ఆడుతావని, బుద్దిగా ఏదైనా పని చేసుకోవాలని తండ్రి శంకరప్ప కొడుకు రఘువీర్ కమ్మార్ కు బుద్దిమాటలు చెప్పాడు. మొబైల్ రీచార్జ్ చేసుకోవడానికి తండ్రి శంకరప్ప డబ్బులు ఇవ్వలేదని కొడుకు రఘువీర్ కమ్మార్ రగిలిపోయాడు.

తండ్రిని ముక్కలుగా నరికాడు
ఆదివారం రాత్రి తల్లిని గదిలో పెట్టి తాళం వేసిన రఘువీర్ నిద్రపోతున్న తండ్రి శంకరప్ప తలను కొడవలితో నరికి కిరాతకంగా హత్య చేశాడు. తండ్రి శంకరప్ప తల, కాళ్లు, చేతులు, మొండెం ముక్కలు చేశాడు. తరువాత తండ్రి జోబులో ఉన్న డబ్బులు తీసుకుని మొబైల్ రీచార్జ్ చేసుకుని గేమ్స్ ఆడాడు. విషయం గుర్తించిన రఘువీర్ తల్లి గట్టిగా కేకలు వెయ్యడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మొబైల్ గేమ్స్ బానిస
మొబైల్ గేమ్స్ కు బానిస అయిన రఘువీర్ అనేక సార్లు తండ్రి శంకరప్పతో గొడవ పడేవాడు. ఇటీవల తండ్రితో గొడవపడి ఇంటి కిటికీల అద్దాలు ద్వంసం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇంటికి వచ్చి రఘువీర్ కు బుద్దిమాటలు చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చారు.

ప్రాణం తీసిన రూ. 200
మీ తండ్రి పోలీసు శాఖలో మంచి పేరు తెచ్చుకున్నారని, పై అధికారులు ఆయనకు ఎంతో గౌరవం ఇస్తారని, బుద్దిగా ఏదైనా పని చేసుకోవాలని ఇటీవల పోలీసులు రఘువీర్ కు బుద్దిమాటలు చెప్పారు. అయితే మొబైల్ గేమ్స్ కు బానిస అయిన రఘువీర్ తండ్రి శంకరప్పను కిరాతకంగా హత్య చేసి, శరీరాన్ని ముక్కలు చేశాడు. పోలీసులు రఘువీర్ ను అరెస్టు చేశారు.మొబైల్ రీచార్జ్ చేసుకోవడానికి రూ. 200 ఇచ్చి ఉంటే శంకరప్ప బతికేవాడని ఆయన కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications