Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెస్ పార్టీలో శర్మిష్ట ముఖర్జీ, అన్షుల్ మీరా కుమార్‌కు కీలక బాధ్యతలు

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ తనయుడు అన్షుల్ కుమార్‌కు కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధులుగా వీరిని నియమించింది.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాల వెల్లడించారు. కాగా, ప్రస్తుతం శర్మిష్ట ముఖర్జీ ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.

 Sonia Gandhi appoints Pranab Mukherjees daughter, Meira Kumars son as Congress new national spokespersons

తమ పార్టీ అధికార ప్రతినిధిగా నియమించినందుకు ఆమె సోనియా గాంధీ, సూర్జేవాలకి కృతజ్ఢతలు తెలిపారు. అధికార ప్రతినిధిగా నియమితుడైన అన్షుల్ కుమార్‌కు ఆమె అభినందనలు తెలిపారు.

సోనియా గాంధీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి బాధ్యతలు చేపట్టిన నెలరోజులకే ఈ నియామకం జరగడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటిమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అదే దారిలో చాలా మంది అధికార ప్రతినిధులు కూడా రాజీనామాలు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+