'ఇటలీ పారిపోయేందుకు సోనియా, ఫ్యామిలీ యత్నాలు'
చండీగఢ్: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుటుంబం ఇటలీ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ గురువారం ఆరోపించారు. సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇప్పటికే తన కంపెనీలను మూసివేస్తున్నాడంటూ వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. తప్పు చేసిన వాళ్లు తప్పక పట్టుబడతారన్నారు.
కాగా, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో 2012లో ఆరు కంపెనీలు స్థాపించిన రాబర్ట్ వాద్రా, వాటిలో నాలుగింటిని మూసివేశారు. మిగిలిన 2 కంపెనీలు కూడా మూసివేతకు సిద్ధంగా ఉన్నాయి. హర్యానాలో బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాబర్ట్ వాద్రా భూలావాదేవీలపై విచారణ జరిపిస్తామని ప్రకటించింది.
దీంతో రాబర్ట్ వాద్రా రాజస్థాన్, హర్యానాల్లోని తన కంపెనీలను మూసేసే ప్రక్రియను ప్రారంభించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. రాబర్డ్ వాద్రా కంపెనీల మూసివేత ప్రక్రియపై డిఎన్ఎ ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది.

ప్రజల సెంటిమెంటును వాడుకుంటున్నాయి: కాంగ్రెస్
జమ్ము కాశ్మీర్‌లోని ప్రాంతీయ పార్టీలు స్థానిక ప్రజల సెంటిమెంటును వాడుకొని ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ నేత అబ్దుల్ ఘనీ వకీల్ ఆరోపించారు. స్వయం ప్రతిపత్తి, స్వయం పాలన అంటూ ఓటర్లను బుట్టలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ చెబుతున్నట్లు కాశ్మీర్‌లో స్వయం పాలన సాధ్యమా అని ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీల మాయలో ప్రజలు పడవద్దని కోరారు.
పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ వాగ్ధానాలు అన్ని వాస్తవ దూరమైనవి ఆరోపించారు. ఒక్క కాంగ్రెస్‌కు మాత్రమే చిత్తశుద్ధి ఉందని చెప్పారు. పీడీపీ చెబుతున్న స్వయంపాలన, నేషనల్ కాన్ఫరెన్స్ చెబుతున్న స్వయంప్రతిపత్తి సాధ్యం అయ్యే పని కాదని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications