స్పీకర్‌పై టి ఎంపీల ఒత్తిడి, ప్రసంగంపై సోనియా డైలమా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు)ను ఎలాగైనా పాస్ చేయాలని తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు సభాపతి మీరా కుమార్ పైన ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు లోకసభలో బిల్లు పైన చర్చ జరిపేందుకు కేంద్రం సిద్ధపడిన విషయం తెలిసిందే.
అయితే సీమాంధ్ర కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యుల ఆందోళనతో ఇప్పటికే లోకసభ మూడుసార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో గందరగోళం మధ్య అయినా బిల్లును పాస్ చేయాలని స్పీకర్ పైన తెలంగాణ ప్రాంత ఎంపీలు ఒత్తిడి తీసుకు వస్తున్నారని తెలుస్తోంది.

అదే సమయంలో తెలంగాణ ముసాయిదా బిల్లు పైన మాట్లాడాలని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన ఒత్తిడి తెస్తున్నారు. దీనిపై ఆమె డైలమాలో పడ్డట్లుగా తెలుస్తోంది. సోనియా బిల్లు పైన మాట్లాడనున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
కాగా, కిరణ్, జగన్, చంద్రబాబు ముగ్గురు సీమాంధ్ర ద్రోహులే అని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తమ 60 సంవత్సరాల కల నెరవేరే సమయం దగ్గర పడిందన్నారు. తెలంగాణ ప్రజల పోరాటాలు, ఆరాటాలు, బలిదానాలు చూసి సోనియా తెలంగాణ ఇస్తున్నారని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తున్నందుకు బిజెపి సహా ఇతర జాతీయ పార్టీలకు ఆయన కృత జ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications