వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోను సూద్ పై ఐటీ శాఖ తనిఖీలకు ఆ డీల్ కారణమా ? సూద్ ఆస్తులు, ఆదాయం, ఫౌండేషన్ పై హాట్ డిబేట్ !!

|
Google Oneindia TeluguNews

రీల్ లైఫ్ విలన్, రియల్ లైఫ్ హీరో, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆపద్బాంధవుడు, నిరుపేదల పాలిట దేవుడు సోను సూద్ కార్యాలయంలో, ఆయన నివాసాలపై ఐటీ శాఖ ఆకస్మిక తనిఖీలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దేశ వ్యాప్తంగా గొప్ప మానవతావాదిగా, సహాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తి గా పేరు తెచ్చుకున్న సోనూసూద్ పై ఐటీ శాఖ నజర్ పెట్టడం వెనుక కారణం ఏంటి అన్న చర్చ ఇప్పుడు అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది. రాజకీయ కారణాలు పక్కన పెడితే ఆయన ఆస్తులు, సూద్ ఫౌండేషన్, ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ సంస్థతో కుదుర్చుకున్న డీల్ చుట్టూ చర్చ జరుగుతుంది.

షాకింగ్ : సోను సూద్ పై ఐటీ నజర్ .. hyd సహా 6 చోట్ల తనిఖీలు; ఆ సీఎంతో భేటీ తర్వాత ..షాకింగ్ : సోను సూద్ పై ఐటీ నజర్ .. hyd సహా 6 చోట్ల తనిఖీలు; ఆ సీఎంతో భేటీ తర్వాత ..

సోను సూద్ ఫౌండేషన్ తో సామాజిక సేవ .. సూద్ ఆస్తులపై ఐటీ నజర్

సోను సూద్ ఫౌండేషన్ తో సామాజిక సేవ .. సూద్ ఆస్తులపై ఐటీ నజర్

తనకున్న సంపాదనను, ఆస్తులను పరోపకారానికి వినియోగిస్తున్న సోనూసూద్ పై ఆదాయపు పన్ను శాఖ దాడులు కాకుండా కొత్తగా సర్వేలు నిర్వహించడంతో అసలు ఏం జరిగింది అన్న చర్చ జరుగుతుంది. సోను సూద్ .. సూద్ ఫౌండేషన్ పేరుతో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ఎవరు ఎలాంటి సహాయం కావాలన్నా క్షణాల్లో అందిస్తున్న సోనుసూద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రభుత్వాలు కూడా పట్టించుకోని ఎన్నో సమస్యలపై, ఎంతోమంది పేద వారి కష్టాలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. అడిగినవారికి లేదనకుండా సహాయాన్ని అందించారు.

సోను సూద్ పై ఐటీ శాఖ తనిఖీలు .. అసలేం జరుగుతుంది.. సామాన్యులకు షాక్

సోను సూద్ పై ఐటీ శాఖ తనిఖీలు .. అసలేం జరుగుతుంది.. సామాన్యులకు షాక్

వలస కార్మికుల కోసం ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేశారు. విదేశాలలో చిక్కుకున్నవారిని తీసుకురావడం కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. అలాగే స్వదేశంలో ఉన్నవారు తమ స్వస్థలాలకు చేరడం కోసం ఆయన చేసిన ప్రయత్నం ప్రశంసనీయం. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఆసుపత్రులలో ఆర్థిక సహాయం కోసం తీవ్రంగా ఎదురు చూసిన వారికి, ఆక్సిజన్, మౌలిక సదుపాయాల లేమితో ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం అందించి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన సోనూసూద్ అందరికీ దేవుడయ్యాడు. అలాంటి సోను సూద్ పై ఐటీ శాఖ నజర్ పెట్టడం సామాన్య ప్రజలకు షాక్ అనే చెప్పాలి. ఎంతోమంది కష్టాలు తీరుస్తున్న సోను సూద్ పై జరిగిన సర్వేలతో సోను సూద్ ఆస్తులపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎంతోమందికి సహాయం చేసిన సోనూసూద్ కి ఉన్న ఆస్తులు ఎంత? ఆయన ఆదాయం ఎంత? అసలు ఆయన పై ఐటీ తనిఖీలు చేయడానికి గల కారణం ఏమిటి ? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన ప్రశ్నలు.

సోను సూద్ పై జరిగినవి దాడులు కాదు .. సర్వేలట .. కొత్త విషయం

సోను సూద్ పై జరిగినవి దాడులు కాదు .. సర్వేలట .. కొత్త విషయం

బుధవారం రోజు ఆదాయపన్ను విభాగం బృందం అకస్మాత్తుగా సినీ నటుడు సోనూసూద్ ముంబై కార్యాలయానికి చేరుకుంది. ఇదే సమయంలో ఏకకాలంలో ముంబై, హైదరాబాద్, ఢిల్లీలతో సహా మొత్తం ఆరు చోట్ల సోనూసూద్ కు సంబంధించిన ఆస్తులపై సర్వేలు చేపట్టింది. అయితే అవి దాడులు కాదని, కేవలం సర్వేలని ఐటి శాఖ చెబుతోంది. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం తనిఖీలకు సర్వేలకు మధ్య వ్యత్యాసం ఉంటుందని, సర్వేలు సాధారణ ప్రక్రియలో భాగంగా చేస్తారని, కానీ దాడులు సర్వే కంటే సమగ్రంగా ఉంటాయని, శక్తివంతమైనవని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి పవర్ కలిగినవని చెబుతున్నారు. సెర్చ్ నిర్వహించే అధికారం ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 132 ఇస్తుందని, ఇక సెక్షన్ 133 ఏ ప్రకారం సర్వే నిర్వహిస్తామని ఆదాయపు పన్ను శాఖ అధికారులు చెబుతున్న పరిస్థితి ఉంది.

 5500 రూపాయలతో ముంబై వచ్చిన సోనుసూద్ ప్రస్తుత ఆస్తుల లెక్క తెలిస్తే షాక్

5500 రూపాయలతో ముంబై వచ్చిన సోనుసూద్ ప్రస్తుత ఆస్తుల లెక్క తెలిస్తే షాక్

ఇదే సమయంలో సోనూసూద్ యొక్క మొత్తం నికర ఆస్తుల విలువ ఎంత ఉంటుందనేది దేశవ్యాప్తంగా ప్రజలకు ఆసక్తికరంగా మారింది. సోను కేవలం 5500 రూపాయలతో ముంబై వచ్చాడని నేడు ప్రజలందరూ దేవుడిగా భావిస్తున్న సోను సూద్ దాదాపు 130 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని చర్చ జరుగుతోంది. సోను సూద్ ఆస్తులపై ఒక మీడియా సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం సోనూసూద్ నికర ఆస్తుల విలువ సెప్టెంబర్ 2021 నాటికి 130 కోట్లు ($ 17 మిలియన్లు). సోను సూద్ ప్రస్తుతం భార్య మరియు పిల్లలతో ముంబైలో నివసిస్తున్నాడు. ఆయన హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు పంజాబీ చిత్రాలలో నటిస్తున్నారు.

 ఒక్కో చిత్రానికి రెండు కోట్లు తీసుకునే సోను సూద్ .. ఆయన సంవత్సరాదాయం ఎంతంటే

ఒక్కో చిత్రానికి రెండు కోట్లు తీసుకునే సోను సూద్ .. ఆయన సంవత్సరాదాయం ఎంతంటే

ఒక్కో చిత్రానికి సోనూసూద్ దాదాపుగా రెండు కోట్లు తీసుకుంటారని సమాచారం. సోనూసూద్ కి సంబంధించి బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు వారి ప్రధాన ఆదాయ వనరు. ఆయన శక్తి సాగర్ ప్రొడక్షన్స్ అనే సొంత నిర్మాణ సంస్థను నిర్వహిస్తున్నారు. దీనికి ఆయన తన తండ్రి పేరు పెట్టారు. సోను ఇప్పటి వరకు దాదాపు 70 సినిమాల్లో పనిచేశాడు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు మరియు సినిమాల నుండి, అతను ప్రతి నెలా ఒక కోటి రూపాయలు సంపాదిస్తాడని , అంటే సంవత్సరంలో మొత్తం 12 కోట్లు సోనూసూద్ ఆదాయం అని చర్చ జరుగుతుంది.

 సోను సూద్ స్థిరాస్తుల, చరాస్తుల లెక్క ఇదే

సోను సూద్ స్థిరాస్తుల, చరాస్తుల లెక్క ఇదే

అంధేరీలోని లోఖండ్‌వాలాలోని 2600 చదరపు అడుగుల 4బీహెచ్ కే అపార్ట్‌మెంట్‌లో సోను తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఇది కాకుండా, అతనికి ముంబైలో మరో రెండు ఫ్లాట్లు ఉన్నాయి. అతని స్వగ్రామం మొగాలో అతనికి ఒక బంగ్లా కూడా ఉంది. అతనికి జుహులో హోటల్ ఉంది. లాక్డౌన్ సమయంలో జుహు లోని హోటల్ ను ఆయన ఐసోలేషన్ సెంటర్ గా మార్చారు. ఇక ఇవి కాకుండా సోను కారు సేకరణలో 66 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ ఎంఎల్ క్లాస్ 350 సీడీఐ , 80 లక్షల విలువైన ఆడి క్యూ7 మరియు 2 కోట్ల విలువైన పోష్ పనామెరా కూడా ఉన్నాయి.

ఇటీవల రియల్ ఎస్టేట్ సంస్థతో చేసుకున్న డీల్ .. ఆదాయపు పన్ను శాఖ సర్వేలకు కారణమా ?

ఇటీవల రియల్ ఎస్టేట్ సంస్థతో చేసుకున్న డీల్ .. ఆదాయపు పన్ను శాఖ సర్వేలకు కారణమా ?

ఇదిలా ఉంటే నిన్న సోను సూద్ ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక సర్వేలు నిర్వహించటం వెనుక ఇటీవల సోనూసూద్ చేసుకున్న ఒక డీల్ కారణమని కూడా చర్చ జరుగుతోంది. సోనూ సూద్ ఇటీవల లక్నోలో ఉన్న ఒక రియల్ ఎస్టేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడని , సోను సూద్‌పై ఆశ్చర్యకరమైన ఐటీ సర్వేలకు ఇదే ప్రధాన కారణం మరియు అతను ఈ డీల్‌పై పన్ను ఎగవేసినట్లు చర్చలు జరుగుతున్నాయి. ఇక రాజకీయంగా మరో రచ్చ కొనసాగుతున్నప్పటికీ సోను సూద్ ఆస్తుల విషయంలో ఏమైనా ఆదాయపు పన్ను ఎగవేశారా ? సామాజిక కార్యక్రమాలతో దూసుకుపోతూ దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు సంపాదిస్తున్న సోనూసూద్ నిర్వహిస్తున్న సూద్ ఫౌండేషన్ లో ఏమైనా లోపాలున్నాయా ? లేక ఇటీవల ఒక రియల్ ఎస్టేట్ సంస్థతో కుదుర్చుకున్న డీల్ తో ఏదైనా జరిగిందా ?అన్నది తెలియాల్సి ఉంది.

English summary
The Income Tax Department surveys in Sonu Sood's residences and his office created a sensation across the country. The debate over what is the reason behind the IT department keeping an eye on Sonu Sood, who is known as a great minded person who helps, is now of interest to everyone. Political reasons aside, his assets, Sood Foundation, a recent deal with a real estate firm, and his net worth are being discussed .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X