భజన భలేగా ఆలపించారు: మోడీ మనసును గెల్చుకున్న కొరియా చిన్నారులు

దక్షిణకొరియాలో మోడీ రెండు రోజులు పర్యటించిన సంగతి తెలిసిందే. తన పర్యటనలో భాగంగా పలు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేసుకున్నాయి. మోడీ జేన్ ఈ మూన్ ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపాయి. ఇక మోడీకి 2019 సియోల్ శాంతి పురస్కారం అందజేశారు.ఈ కార్యక్రమం సందర్భంగా మోడీని ఒక అంశం తన మనసును హత్తుకుంది.

South Korean kids singing Vaishnav Jan Toh to honour Modi in Seoul is winning hearts

భారత ప్రధాని నరేంద్ర మోడీకి సియోల్ శాంతి పురస్కారం లభించింది. ఈ కార్యక్రమాన్ని ఎంతో గ్రాండ్‌గా నిర్వహించింది దక్షిణ కొరియా ప్రభుత్వం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను ఆకట్టుకున్నాయి. ఇక ప్రత్యేకించి దక్షిణ కొరియా చిన్నారులు చక్కగా భారతీయత ఉట్టిపడే వస్త్రాలు ధరించి 'వైష్ణవ జనతో ' గీతం ఆలపించారు. చిన్నారులు పాడిన ఈ పాట ప్రధాని నరేంద్ర మోడీ ఆకట్టుకుంది. ఆ చిన్నారుల పాటకు మోడీ ముగ్ధులయ్యారు. ఒక్క మోడీదే కాదు అక్కడికి చేరివచ్చిన అతిథుల హృదయాలను సైతం ఈ చిన్నారులు గెలుచుకున్నారు.

కార్యక్రమం ముగిశాక ఏర్పాటు చేసిన విందులో చిన్నారులు ఈ భజన గీతాన్ని ఆలపించారు. పాట పాడుతూ అందుకు తగ్గట్టుగా నృత్యం కూడా చేశారు. ఇంతటి చక్కని కలర్‌ఫుల్ వీడియోను విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి రవీష్ కుమార్ ట్విటర్‌లో పోస్టు చేశారు. ఇంతకంటే చక్కగా వైష్ణవ్ జన్‌తో భజన ఆలపించడం ఎక్కడైన చూశారా అంటే తన ట్విటర్ పోస్టుపై రాసుకున్నారు. వీడియోను ట్విటర్‌లో షేర్ చేసిన వెంటనే వీడియో వైరల్ అయ్యింది. ఇది చూసిన నెటిజెన్లు భారత్ దక్షిణ కొరియా దేశాల మధ్య సంబంధం బలపడుతోందని చెప్పేందుకు ఈ వీడియోనే నిదర్శనం అంటూ కామెంట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+